https://oktelugu.com/

Sircilla: బట్టలన్నీ విప్పి పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డాడు… ఆ తర్వాతే అసలు ట్విస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అర్ధరాత్రి ఓ వ్యక్తి మద్యం సేవించి హల్‌చల్‌ చేశాడు. స్టేషన్‌ గేటు ముందు నడి రోడ్డుపై నగ్నంగా హంగామా చేశాడు.

Written By: , Updated On : March 15, 2024 / 10:23 AM IST
drunken man halchal in front of police station

drunken man halchal in front of police station

Follow us on

Sircilla: మందు బాబులకు చుక్క పడందే నిద్ర పట్టదు. అయితే కొందరు పీగలదాకా తాగి హంగామా చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. చివరకు యువతులు, మహిళలు కూడా మద్యం మత్తులో పోలీసులతో వాగ్వాదానికి దిగడం చూస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళ మద్యం మత్తులో ఆర్టీసీ కండక్టర్‌పై చేయి చేసుకోవడం చూశాం. గతంలో ఓ మహిళ రోడ్డుపై అర్ధనగ్నంగా డాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. మత్తు తలకెక్కగానే ఈ లోకాన్నే మర్చిపోతున్న మందుబాబులు తాము ఏం చేస్తున్నామో మర్చిపోతున్నారు. తాజాగా ఓ మందుబాబు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌ ముందే హంగామా చేశారుడు. నగ్నంగా తిరుగుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు.

సిరిసిల్లలో సోయి లేకుండా..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అర్ధరాత్రి ఓ వ్యక్తి మద్యం సేవించి హల్‌చల్‌ చేశాడు. స్టేషన్‌ గేటు ముందు నడి రోడ్డుపై నగ్నంగా హంగామా చేశాడు. అడ్డుకున్న పోలీసులపైకీ ఎగరబోయాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనీరు గ్రామానికి చెందిన జైపాల్‌ ఆర్టీసీ బస్సులో వచ్చి సిరిసిల్ల పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ముందు దిగాడు. స్టేషన్‌లో నైట్‌ డ్యూటీ చేస్తున్న పోలీసు ల వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పోలీస్టేషన్‌ గేటు ఎదుట బట్టలు విప్పి నగ్నంగా ఇష్టానుసారం బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు.

2 గంటలు కష్టపడి..
ఇక జైపాల్‌ వేధింపులతో పోలీసుల తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు 2 గంటలపాటు తాగుబోతు హంగామా చేయగా అతడిని సముదాయించేందుకు పోలీసులు నానా తిప్పలు పడ్డారు. ఎంత చెప్పినా, బెదిరించిన జైపాల్‌ వినలేదు. చివరకు అతడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. వారు వచ్చి జైపాల్‌ను సముదాయించారు. తర్వాత పోలీసులు కుటుంబ సభ్యులకు, జైపాల్‌కు కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపించారు.

ఇన్నాళ్లూ రోడ్లపై తాగుబోతులు హల్‌చల్‌ చేయడం చూశాం. కానీ, తాజాగా పోలీస్‌ స్టేషన్‌కే వచ్చి, పోలీసులకే దమ్కీ ఇవ్వడం, దీనికి సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.