Chandrababu: చంద్రబాబు నమ్మకం అదే

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు అందిస్తూ వస్తున్నారు. అదే తనకు శ్రీరామరక్ష అవుతుందని జగన్ భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి.

Written By: Dharma, Updated On : March 15, 2024 10:11 am

Chandrababu

Follow us on

Chandrababu: ఈ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొడతానని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. టిడిపి నేతృత్వంలోని కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమాతో ఉన్నారు. జగన్ సర్కార్ పై విపరీతమైన ప్రజా వ్యతిరేకత..బిజెపి, జనసేనతో కూటమి కట్టడం.. ప్రత్యామ్నాయం లేకపోవడం.. జగన్ కు మించి సంక్షేమ పథకాలు ఇస్తానని హామీలుస్తుండడం.. అభివృద్ధి లేకపోయిందని ప్రజల్లోకి బలంగా వెళ్లడం.. తదితర కారణాలతో ప్రజలు టిడిపికి పట్టం కడతారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు అందిస్తూ వస్తున్నారు. అదే తనకు శ్రీరామరక్ష అవుతుందని జగన్ భావిస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా టిడిపి అనుకూల మీడియా అభివృద్ధి లేదనే అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విపరీతమైన కథనాలు రాస్తూ వచ్చింది. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. జగన్ హయాంలో 20 సంవత్సరాల వెనక్కి ఏపీ అభివృద్ధి వెళ్లిపోయిందన్న కామెంట్ ప్రజల్లోకి చుచ్చుకెళ్లేలా సక్సెస్ అయినట్లు చంద్రబాబు భావిస్తున్నారు. మళ్లీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలన్న నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అది తనకు కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమి ప్రయోజనం చేకూరుస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో తటస్తులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు తనకు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం పెట్టుకున్నారు. మరోవైపు కూటమిని తక్కువ సీట్లకు ఒప్పించగలడం కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. వ్యవస్థలపరంగా బిజెపి సహకరిస్తుందని.. పవన్ ద్వారా యువతను ఆకట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలుగా భావిస్తున్నారు.

అయితే అన్నింటికీ మించి ఈసారి అభివృద్ధితో పాటు సంక్షేమం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అభివృద్ధి లేదన్న విమర్శను జగన్ సర్కార్ మూటగట్టుకుంది. అందుకే దానిపై ప్రత్యేక ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అందుకే జగన్ కు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పడం ద్వారా.. వైసిపి అనుకూల వర్గాలను సైతం తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆశించే వారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి ఆశిస్తున్న వారు చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామని చెప్పడం ద్వారా మిగతా వర్గాల మద్దతు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబు విజయం పై భారీ ధీమా పెట్టుకున్నారు. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.