Buzz Ball Cricket : భారత బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో అన్ని రికార్డులు బద్దలైపోయాయి.. ముఖ్యంగా బజ్ బాల్ పేరుతో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో సృష్టిస్తున్న సంచలనాలు మొత్తం ఒక్క ఇన్నింగ్స్ తో గాలిలో కొట్టుకుపోయాయి. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ – రోహిత్ శర్మ మైదానంలో బ్యాట్ తో శివతాండవం చేశారు. ఈ సూపర్ బ్యాటింగ్ ద్వారా భారత ఓపెనర్లు సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఆరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ జట్టు 233 పరుగులకు ఆల్ అవుట్ కాగా.. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ధాటిగా మొదలుపెట్టింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ – రోహిత్ శర్మ బరిలోకి దిగి.. తొలి ఓవర్ నుంచే తమ ఉద్దేశమేమిటో బంగ్లా బౌలర్లకు చూపించారు. కేవలం 18 బంతుల్లోనే 50+ పరుగులను జోడించారు. ఫలితంగా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన జోడిగా జైస్వాల్ – రోహిత్ నిలిచారు.
అంతకుముందు ఈ రికార్డు బజ్ బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ – బెన్ స్టోక్స్ పేరు మీద ఉండేది. వీరిద్దరూ కేవలం 26 బంతుల్లోనే 50+ పరుగులు చేశారు. అయితే ఆ ఘనతను రోహిత్, యశస్వి బ్రేక్ చేశారు. రోహిత్ 11 బంతుల్లో మూడు సిక్స్ లు, ఒక ఫోర్ సహాయంతో 23 పరుగులు చేశాడు. రోహిత్ అవుట్ అయినప్పటికీ యశస్వి తన దూకుడు తగ్గించలేదు. బంగ్లా బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు కేవలం 31 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. భారత జట్టు తరఫున టెస్టులలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన నాలుగవ ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు రిషబ్ పంత్ 28 బంతుల్లో, కపిల్ దేవ్ 30 బంతుల్లో, చార్దుల్ ఠాకూర్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు. ఇది మాత్రమే కాకుండా భారత జట్టు 10.1 ఓవర్లలోనే వంద పరుగుల మార్కు అందుకుంది. ఫలితంగా టెస్టులలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి జట్టుగా భారత్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. అంతకుముందు భారత జట్టు 2023లో వెస్టిండీస్ పై 12.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. అయితే ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసింది. కేవలం 10.1 ఓవర్లలోనే సెంచరీ మార్క్ అందుకుంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Jaiswal rohit became the fastest half century pair in the 147 year history of test cricket
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com