Jagan: రాను రాను అంటూనే అసెంబ్లీకి జగన్

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Written By: Dharma, Updated On : June 20, 2024 5:43 pm

Jagan

Follow us on

Jagan: ఏపీ అసెంబ్లీకి హాజరుపై జగన్ పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు. వెళ్తానని కానీ.. వెళ్ళనని కానీ సూటిగా సమాధానం చెప్పలేదు. కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వనూ లేదు. కానీ హాజరైతే ఎదురయ్యే పరిణామాల విషయంలో మాత్రం ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు అండ్ కోకు ఎదురైన పరిణామాలే తమకు ఎదురవుతాయని జగన్ ఊహించారు.కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని.. సీటు కూడా కేటాయించారని.. మైకు కూడా ఇవ్వరని గుర్తు చేశారు జగన్. వెళ్లే వాళ్ళు వెళ్లని.. ఉండేవారు ఉండనని జగన్ తేల్చి చెప్పడం విశేషం.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అని జగన్ తర్జనభర్జన పడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, కీలక నాయకులతో జగన్ భేటీ అయ్యారు. వారితో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్దామని కొందరు.. వద్దని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరకు అధినేత జగన్ నిర్ణయానికే వదిలేశారు.

175 నియోజకవర్గాలకు గాను వైసీపీ 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది. గెలిచిన వారిలో జగన్ ఒకరు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గెలిచారు. మిగతా ఎనిమిది మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. బలమైన వాయిస్ ఉన్నవారు ఒక్కరు లేరు. అందుకే అసెంబ్లీకి వెళ్లి ప్రమాణం మాత్రమే చేసి రావాలని నాయకులకు తేల్చి చెప్పారు. తాను కూడా వస్తానని.. తరువాత సభలకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై ఎవరికి వారు నిర్ణయించుకోవాలని సూచించారు. తాను ఎవరిని వద్దని కానీ.. వెళ్లాలని కానీచెప్పబోనని తేల్చి చెప్పారు. ‘ అసెంబ్లీకి వెళ్లినా మైక్ ఇవ్వరు. పైగా హేళన చేస్తారు. ఇవన్నీ భరించడం అవసరమా? మీ ఇష్టం. వెళ్లే వాళ్లను వద్దని చెప్పను. వెళ్ళమని కూడా చెప్పను. అది మీ ఇష్టం. వెళ్తే కానీ బాగుండదని కొందరు అంటున్నారు. అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. నేను ప్రజల మధ్యకు వెళ్తాను. ప్రజలతోనే ఉంటాను. మన వాయిస్ ప్రజల మధ్య వినిపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా’ వన్ టు జగన్ వ్యాఖ్యానించారు. దీంతో జగన్ మాటను జవదాటని వారంతా.. తాము కూడా అసెంబ్లీకి వెళ్లకూడదని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు.