https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆ ఒక్క వీక్ నెస్ కారణం గా ఆయన కెరియర్ మీద భారీ దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయా.?

పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్... ఆయనతో సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 11, 2024 / 07:20 PM IST
    Follow us on

    Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఆయన లాంటి నటులు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక తను ప్రస్తుతం రాజకీయపరంగా కూడా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తన భాద్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా కేసులను సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే ప్రజలకు ఏ అవసరాలైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని తక్షణమే పరిష్కరించే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చాలా పెద్ద హీరోగా గుర్తింపు పొందినప్పటికీ ఆయనకున్న ఒక వీక్ నెస్ వల్లే ఆయన కొన్ని విషయాల్లో చాలా వరకు వెనుకబడిపోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ను ద్వేషించే వాళ్ళు, తనని అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా తర్వాత ఆయన్ని శరణు కోరితే వారిని క్షమించేసి వదిలేస్తాడు.

    తనతో పాటు మళ్ళీ పార్టీ లో కలుపుకుంటాడు ఇలాంటి వీక్ నెస్ వల్లే పవన్ కళ్యాణ్ ని చాలామంది వాడుకొని వదిలేస్తున్నారు. చాలామంది హీరోల సినిమాలు సక్సెస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ కావాలి. అయితే ఆయనని తమ ప్రి రిలీజ్ ఈవెంట్లకు పిలిపించుకోవడం, సినిమాల్లో ఆయనకు సంబంధించిన సీన్స్ గాని, డైలాగులను గాని వాడుకొని సక్సెస్ లను కొడుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ కోసం, పార్టీ కోసం కొంచెం కూడా సహాయం చేయరు. ఇంకా కావాలంటే తనకు ఆపోజిషన్ లో ఉన్న వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు.

    అందుకే పవన్ కళ్యాణ్ కూడా అలాంటి వాళ్ళ విషయంలో చాలా దురుసుగా ఉంటేనే తప్ప ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్లలేరు అనేది మాత్రం చాలా కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అతన్ని చాలామంది ఇప్పటివరకు తనతో పాటు ఉంటూనే వెన్నుపోటు పొడుస్తూ వచ్చారు.ఇక రీసెంట్ గా వాళ్ళందరి గురించి తెలుసుకున్న ఆయన ప్రస్తుతానికైతే పార్టీ నుంచి గాని, పర్సనల్ విషయాల నుంచి గానీ వాళ్లందరికీ దూరంగా ఉంటూ వస్తున్నారు.

    ఇక ఫ్యూచర్ లో కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక ధోరణిని అనుసరిస్తూ ఎవడు మిత్రువు ఎవడి శత్రువు అనేది తెలుసుకొని తనను ద్వేషించిన వారిని మళ్లీ తనతో పాటు కలుపుకోకుండా దూరంగా పెడితేనే మంచిది అలా చేస్తేనే ఆయన రాజకీయంగా ఇంకా చాలా ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు… ఇక రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించబోతున్నాడు అనే విషయం కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి పొజిషన్ లోనే ఆయన చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆయనకు సలహాలను ఇస్తున్నారు…