https://oktelugu.com/

Honda Car: మార్కెట్లోకి Honda కొత్త కారు.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. ధర తెలిస్తే కొనేందుకు ఎగబడుతారు..

ఆటోమోబైల్ మార్కెట్లో Honda కార్లకు మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన హోండా సిటీ, ఎలివేట్ వంటి కార్లను వినియోగదారులు ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే వీటన్నింటి కంటే Amaze కారుకు ఆదరణ ఎక్కువగా ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : December 4, 2024 / 04:14 PM IST

    Honda-Cars

    Follow us on

    Honda Car: ఆటోమోబైల్ మార్కెట్లో Honda కార్లకు మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన హోండా సిటీ, ఎలివేట్ వంటి కార్లను వినియోగదారులు ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే వీటన్నింటి కంటే Amaze కారుకు ఆదరణ ఎక్కువగా ఉంది. అందుకే ఈ మోడల్ లేటేస్ట్ కారు తాజాగా మార్కెట్లోకి వచ్చింది. డిసెంబర్ 4న రిలీజ్ అయిన ఈ కారు డిజైన్ చూసి కారుప్రియులు షాక్ అవుతున్నారు. చూడ్డానికి ఖరీదైన కారులా అనిపిస్తున్నా ఈ కారను మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అందుబాటులో ఉంచారు. దీని అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఇంజిన్ పనితీరు గురించి తెలిసి కొనేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఈ కారు ఎలా ఉందంటే?

    హోండా అమేజ్ 2024 కారు ఈ కంపెనీకే చెందిన ఎలివేట్ ఎస్ యూవీని పోలి ఉంటుంది. అయితే కొత్త కారు రిఫ్రెష్ డిజైన్ ను కలిగి ఉంది. దీని ఫ్రంట్ బంపర్ బోల్డ్, ఫాగ్ ల్యాంప్స్ కోసం ఎల్ ఈడీ ప్రాజెక్టర్లను కలిగి ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ ఎస్ యూవీ కారులాగే ఉన్నాయి. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్ మధ్యలో హోండా లోగోతో మొత్తం ఎక్సా గోనల్ ఆకృతిలో ఉంది. ఇది కాంపాక్ట్ సెడాన్ కారు కాబట్టి దీనిని హోండా సిటీ నుంచి మోడల్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని టెయిల్ ల్యాంప్ మాత్రం డిజైన్ భిన్నంగా ఉంటుంది. బ్రేక్ లైట్లు, మూడు నిలువు స్లాట్లను కలిగి ఉన్న ఈ కారుకు కొత్త రియర్ బంపర్ ఉంటుంది.

    ఈ కారు ఇన్నర్ లో బూట్ స్పేస్ 416 లీటర్లు ఉంచారు. దీనికి 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇన్నర్ విషయానికొస్తే ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో ప్లోటింగ్ ఉన్నాయి. 8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి సేప్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఇతర కార్ల మాదిరిగానే ఇందులోనూ ఏడీఎస్ సిస్టమ్ కెమెరా ఉంది. 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్ ను ఇందులో అమర్చారు.

    కొత్త హోండా కారులో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది. 89 బీహెచ్ పీ పవర్, 110 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ లీటర్ పెట్రోల్ కు 19.46 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటేమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పాటు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్ ఆప్షన్ ఇందులో ఉంది. కొత్తగా రిలీజ్ అయిన హోండా అమేజ్ ను రూ.9.10 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. టాప్ ఎండ్ రూ.9.69 లక్షలుగా ఉంది. ఈ కారు స్టాండర్డ్ గా 3 సంవత్సాలు, అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తున్నారు. డిజైన్ పై ఫోకస్ పెట్టేవారు ఈ కారు అనుగుణంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.