Telugu Girl In America : అగ్రరాజ్యం అమెరికా అంటేనే.. పోటీల్లో ఎవరు ఉన్నా.. జడ్జిలు అమెరికా వారికే ప్రైజ్‌లు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. నోబెల్ ప్రైజ్‌లు, బూకర్ ప్రైజ్‌లు.. ఫ్యాషన్ పోటీల్లో అన్నీ అమెరికా వారినే వరిస్తుంటాయి. కానీ, అదే అమెరికా గడ్డపై మెరిసింది తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అగ్రరాజ్యంలో ఎగురవేసింది. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచింది. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన పోటీల్లో అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి 118 మంది పాల్గొన్నారు. కానీ తెలుగమ్మాయే నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్‌గా నిలిచింది. అవార్డులు గెలుచుకునే అమెరికాలోనే అవార్డు గెలుచుకుంటే ఉండే కిక్కే వేరు కదా.
తెలివైన యువతి…
తెలుగమ్మాయి హన్సిక నేషనల్ అ మెరికన్ మిస్ జూనియర్ టీన్ పోటీల్లో విజేతగా నిలిచింది. అంతకుముంద యూఎస్‌ఏ నేషనల్ లెవల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్‌మెంట్ విన్నర్ అవార్డు సొంతం చేసుకుంది. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటం సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యం నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆరేళ్లుగా పోటీల్లో…
హన్సిక ఆరేళ్లుగా వివిధ పోటీల్లో పాల్గొంటూ సత్తా చాటుతోంది. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యునైటెడ్ మిస్, యూఎస్‌ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో సత్తా చాటింది. హన్సిక స్వస్థలం తెలంగాణలోని వనపర్తి. తండ్రి శేఖర్, తండ్రి ప్రశాంతి ప్రముఖ భరతనాట్య కళాకారిణి. నటి, కన్నడ తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు.
మిస్ యూనివర్స్‌పై దృష్టి..
నేషనల్ అమెరిక జూనియర్ టీన్‌గా నిలిచిన హన్సిక తన లక్ష్యం మిస్ యూనివర్స్ కావడమే అంటోంది. చదువలో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యనివర్సిటీ లేదా హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హన్సిక వెల్లడించింది.