Dil Raju : మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ఆయన ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈయనతో పాటుగా వెంకటేష్ కూడా ఈ సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాలకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దిల్ రాజు తనదైన రీతిలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… అయితే 2025 సంక్రాంతి కానుకగా ఆయన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఇక అందులో భాగంగానే రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాను జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నహాలు చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలుపుతున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో ఆయన ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం పట్ల అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ రెండిట్లో ఏ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…
ఇక ఈ రెండు సినిమాలు అతనివే కావడం వల్ల ఆయన సినిమాలకు భారీగా నష్టం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా మరొక సినిమా మాత్రం కలెక్షన్స్ రూపంలో చాలా వరకు వెనుకబడి పోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇక రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దిల్ రాజు పంట పండినట్టే…
ఇక దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ చాలా స్ట్రాటజీలను మేయిటైన్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇందులో కూడా ఏదో మెలిక ఉంది అంటూ తనదైన రీతిలో ట్రేడ్ పండితులు కొంతవరకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిస్తే అటు వెంకటేష్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు అవుతారు.
లేకపోతే మాత్రం ఈ సినిమా వాళ్ళిద్దరికి ఒక చేదు అనుభవాన్ని మిగులుస్తుందనే చెప్పాలి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఈ సంవత్సరం సంక్రాంతి హీరో అవుతారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీళ్లతో పాటు డాకు మహారాజు సినిమాతో బాలయ్య బాబు కూడా పోటీకి వస్తున్నాడు. కాబట్టి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…