Aus vs WI 1st T20 highlights: బౌలర్ బంతి వేయడమే ఆలస్యం స్టాండ్స్ లోకి లోకి వెళ్ళింది. బంతి మీద ఏదో దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టు.. బౌలర్లతో గెట్టు పంచాయితీలు ఉన్నట్టు.. అతని బ్యాటింగ్ సాగింది. మామూలు కాదు.. కని విని ఎరుగని స్థాయిలో అతడు రెచ్చిపోయాడు. ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. కంగారు జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తద్వారా టెస్ట్ సిరీస్ విజయపరంపరను కంగారు జట్టు కొనసాగించేలా చేశాడు..
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మ్యాచ్ టై.. బౌలవుట్ లో ఏం జరిగిందంటే? వైరల్ వీడియో
వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 3-0 తో గెలుచుకొని కంగారు జట్టు సంచలనం సృష్టించింది. దానిని టి20 సిరీస్ లో కూడా కొనసాగిస్తోంది. 5 t20 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో కంగారు జట్టు అద్భుతం చేసింది. ఆదివారం అర్ధరాత్రి కింగ్ స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో కంగారు జట్టు మూడు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. షై హోప్ 55, చేజ్ 60 పరుగులతో అదరగొట్టారు. హిట్ మేయర్ 38 పరుగులు చేసి అదరగొట్టాడు.. కంగారు జట్టు బౌలర్లలో బెన్ నాలుగు వికెట్లు సాధించాడు. అబౌట్, కూపర్, ఎల్లిస్, మిచెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. లోయర్ ఆర్డర్ సరిగ్గా ఆడకపోవడం శాసించింది. ముఖ్యంగా 19 ఓవర్లో బెన్ వేగంగా మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రసెల్, షేర్పన్, హోల్డర్ వికెట్లను సొంతం చేసుకున్నాడు.
ఆ తర్వాత కంగారు జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. కంగారు జట్టులో గ్రీన్ 26 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇతడు ఇన్నింగ్స్ లో ఐదు సిక్సులు ఉన్నాయి. రెండంటే రెండు ఫోర్లు మాత్రమే ఉన్నాయి. మిచల్ ఓవన్ 27 బంతుల్లో 6 సిక్స్ లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఓవన్ కు ఇది డెబ్యు మ్యాచ్ కావడం విశేషం. ఆతిథ్య జట్టు బౌలర్లలో జాస్సన్ హోల్డర్ 2, జోసఫ్ 2, మోతి రెండు వికెట్లు సాధించారు.. ఈ రెండు జట్ల మధ్య రెండవ మ్యాచ్ బుధవారం జరుగుతుంది.
Also Read: ఇంగ్లాండ్ వేదికగా పాకిస్తాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇండియా..
ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఆతిథ్య జట్టు మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ఆటగాళ్లు టి20 ఫార్మేట్ కు అలవాటు పడటం వల్ల టెస్టు సిరీస్ లలో సరిగా ఆడలేక పోతున్నారని సీనియర్ ప్లేయర్లు మండిపడ్డారు. లారాలాంటి ఆటగాడైతే జట్టు మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు ఇంతటి దుస్థితికి కారణం మేనేజ్మెంట్ అని మండిపడ్డాడు. ఇప్పటికైనా జట్టు విషయంలో సమూల ప్రక్షాళన చేయకపోతే తదుపరి కాలం మారింత దారుణంగా ఉంటుందని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ వెస్టిండీస్ జట్టు ఆట తీరు ఏమాత్రం మారలేదు. మారాలని విండీస్ ఆటగాళ్లు కోరుకోవడం లేదు.