Robo Movie Villain Danny Denzongpa: ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో వచ్చిన రోబో సినిమా గురించి అందరికీ తెలిసిన విషయమే. 2018లో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో రజనీకాంత్ కు పోటీగా నటించిన విలన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. రూపాలను తయారు చేస్తూ అందులో రెడ్ చిప్స్ ను పెట్టి కొత్త రోబోను తయారుచేసి ఆకట్టుకున్న ఈయనను చూస్తే చైనీస్ వ్యక్తి లాగే ఉంటాడు. కానీ ఇతను బాలీవుడ్ నటుడు అన్న విషయం చాలామందికి తెలియదు. అంతేకాకుండా ఇతను సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కూడా. ఈయన వ్యాపారం గురించి తెలిస్తే షాక్ తినడం ఖాయం. మరి ఆయన గురించి తెలుసుకోవాలని ఉందా..
రోబో సినిమాలో విలన్ గా నటించిన ఈయన పేరు డానీ డెంజోగ్పా. భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం లో జన్మించిన ఈయన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు. భారత సైన్యంలో చేరాలని ఆశ ఉన్న డానికి అనుకోకుండా సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. అలా 1972లో జరురత్ అనే సినిమాలో మొదటిసారిగా నటించి సినీ కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత మందల కొద్ది సినిమాల్లో నటించిన ఆయన.. 1980లో సినిమాలు మానేయాలని అనుకున్నాడు. అయితే అవకాశం వచ్చిన సినిమాల్లో నటిస్తూ మరోవైపు వ్యాపారం వైపు దృష్టి పెట్టాడు. సినిమాల్లో నటించేవారు వచ్చిన డబ్బుతో జల్సా చేస్తుంటే.. దాని మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు. అలా పలు సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు.
Also Read: అది నాని డెడికేషన్… మేటర్ తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు!
1987లోనే యుక్సోమ్ బ్రూవరీస్ అనే బీర్ కంపెనీనీ స్టార్ట్ చేశాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు దీనిపై కూడా ప్రత్యేక పోకస్ పెట్టడంతో ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అలా ప్రతి సంవత్సరం 100 కోట్ల ఆదాయాన్ని తీసుకువచ్చే సంస్థగా ఎదిగింది. ఒకానొక దశలో డానీ ప్రముఖ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ అధినేత విజయ్ మాల్యాతో పోటీపడ్డాడు. ఆయనకు చెందిన ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు డానీ సిద్ధపడ్డాడు. దీంతో ఈయన సంస్థ మరింత ప్రాచుర్యం పొందింది.
అయితే డానీ 2022 తర్వాత సినిమాలు చేయడం తగ్గించారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వ్యాపారం పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 1987లో స్టార్ట్ చేసిన తన వ్యాపారాన్ని ఆ తర్వాత ఒడిశాలో, అస్సాంకు విస్తరించాడు. ప్రస్తుతం అస్సాం లోని రైనా ఏజెన్సీలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోని బ్రూవరీస్ కలిపి ఏడాదికి 6.8 లక్షల హెచ్ ఎల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో బీర్ల కంపెనీల్లో మూడో స్థానాన్ని ఆక్రమించిన దీని నుంచి Donsberg,Heman వంటి బీర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి ద్వారా మొత్తం రూ. 100 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఆయా కంపెనీల్లో మొత్తం 250 మంది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.