Ball out Viral Video: క్రికెట్లో అప్పుడప్పుడూ అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ లో ఇటువంటి సంచలనాలు నమోదు అవుతుంటాయి. 18 సంవత్సరాల క్రితం పొట్టి ఫార్మాట్ ను ఐసీసీ ప్రవేశపెట్టిన తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో రెండు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. ఈ దశలో తుది ఫలితం కోసం అంపైర్లు బౌల్ అవుట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ముందుగా బంతి అందుకున్న భారత ప్లేయర్లు హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సెహ్వాగ్ వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు వికెట్లు తీయలేకపోయారు. దీంతో భారత్ సంచలనాత్మక విజయం సాధించింది.
దాదాపు 2007 తర్వాత మళ్లీ ఇప్పుడు బౌల్ అవుట్ నిర్వహించాల్సి వచ్చింది. కాకపోతే ఇది ఐసీసీ నిర్వహించిన టోర్నీలో కాదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా క్రికెట్ లెజెండ్స్ టోర్నీ ఆడుతున్నారు. ఈ టోర్నీ పేరు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్. ప్రస్తుతం రెండవ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్లో భాగంగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడ్డాయి. రెండు జట్లలో కూడా లెజెండరీ ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది.. చివరికి రెండు జట్ల పరుగులు సమానమయ్యాయి.
బర్మింగ్ హమ్ వేదికగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను 11 ఓవర్ల పాటు నిర్వహించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 79 పరుగులు చేసింది. ఆ తర్వాత 80 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు కూడా 79 పరుగులు చేసింది. రెండు జట్ల పరుగులు సమానం కావడంతో అంపైర్లు బౌల్ అవుట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ బౌల్ అవుటులో సౌత్ ఆఫ్రికా బౌలర్లు రెండు బౌల్డులు చేశారు. అయితే వెండిస్ మాత్రం ఒక్క బౌల్డ్ కూడా చేయలేకపోయింది.. దీంతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది.
రెండు జట్ల స్కోర్లు సమానం కావడంతో బౌల్ అవుట్ నిర్వహించడం అభిమానులు కూడా సరికొత్త అనుభూతి కలిగించింది. ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా బౌలింగ్ వేశారు. అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో రెండు వికెట్లు సొంతమయ్యాయి. కానీ వెస్టిండీస్ బౌలర్లు అలా బౌలింగ్ వేయలేకపోయారు. లయను కోల్పోయి బంతులు వేయడంతో వికెట్లు సొంతం చేసుకోలేకపోయారు. దీంతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. కేవలం 11 ఓవర్ల పాటే ఈ మ్యాచ్ జరిగినప్పటికీ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మజా అందించింది. ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా ఆడారు. లెజెండరీ ఆటగాళ్లు ఒకప్పుడు తాము ఎలా ఆడారో.. ఇప్పుడు కూడా అలానే మైదానంలో సందడి చేశారు. తద్వారా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు క్రికెట్ మజాను ఆనందించారు.
” బౌల్ అవుట్ దాకా మ్యాచ్ వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. టి20 అంటేనే అసలైన క్రికెట్ ఆనందం లభిస్తుంది. 11 ఓవర్ల పాటే ఈ మ్యాచ్ జరిగినప్పటికీ చివరి వరకు ఉత్కంఠ గా సాగింది. క్షణక్షణం థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఉత్కంఠకు గురి చేసింది. నిజానికి ఇలాంటి మ్యాచ్ జరగడం గొప్ప విషయం. ఇలాంటి మ్యాచ్ చూడడం అత్యంత ఆనందకరం. మమ్మల్ని సమ్మోహితులను చేసినందుకు ఆటగాళ్లకు ధన్యవాదాలు అంటూ” అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
NOSTALGIA FOR FANS – A BOWL OUT IN CRICKET AFTER A LONG TIME. ❤️pic.twitter.com/4LGiYv6inf
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 20, 2025