Wife Poisons Sambar: ప్రాంతాలు మారుతున్నాయి. జరిగే సంఘటనలు మారుతున్నాయి.. జరుగుతున్న దారుణాలలో మాత్రం భర్తల జీవితాలు కడతేరిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ మార్పు రావడం లేదు. న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పోలీసులు అధునాతన పద్ధతులను ఉపయోగించి పట్టుకుంటున్నప్పటికీ కొంతమంది భార్యలు మారడం లేదు.
ఢిల్లీలో ప్రియుడి మైకంలో భార్య భర్తను చంపిన ఘటన మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది.. సాంబార్ లో విషం కలిపి భర్తను లేపేసింది ఓ భార్య. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా ఆరూరు సమీపంలో కీరై పట్టి అనే ఒక గ్రామం ఉంది.. ఈ గ్రామంలో అమ్మూబీ, రసూల్ దంపతులు జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మూబీ గృహిణిగా ఉంటుండగా.. రసూల్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కలిగేంతవరకు అమ్మూబీ బాగానే ఉంది. ఆ తర్వాత ఇటీవల ఆమె తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంది. భర్తను దూరం పెట్టడం.. నిత్యం ఫోన్లో మాట్లాడడం వంటివి చేస్తోంది. అయితే ఆమెకు లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య ప్రవర్తన చిత్రంగా ఉండడంతో రసూల్ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు.
లోకేశ్వరన్ స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహించేవాడు. లోకేశ్వరన్ అమ్మూబీ రహస్యంగా కలుసుకున్న తీరును రసూల్ గమనించాడు. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.. ఆ తర్వాత పంచాయతీలు జరిగాయి. అనంతరం సక్రమంగా ఉంటారని అమ్ము మాట ఇచ్చింది.. అయితే మళ్లీ ఆమె దారితప్పింది.. ఈసారి ఆమె ప్రియుడు , ఆమె కలిసి ఒక ప్రణాళిక రూపొందించారు.. రసూల్ ను లేపేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగా వారి ప్రణాళికను అమలులో పెట్టారు.
Also Read: Mithun Reddy Arrested: మిథున్ రెడ్డి అరెస్ట్.. అంతా సైలెన్స్!
ముందుగా రసూల్ కు అమ్మూబీ పండ్ల రసం ఇచ్చింది. అందులో విషం కలిపింది. దానిని తాగడానికి రసూల్ నిరాకరించాడు. ఆ తర్వాత సాంబార్ లో పురుగుల మందు కలిపి అతడికి ఇచ్చింది. అన్నంలో కలుపుకొని తిన్న అతడు ఒకసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మృతుడి భార్యపై నిఘా పెట్టారు.
పోలీసుల పరిశీలనలో రసూల్ ను అతని భార్య చంపినట్టు తెలింది. అతని భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్ లలో రసూల్ తో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించాయి..”నువ్వు నాకు ఇచ్చిన క్రిమిసంహారకమందును ముందుగా దానిమ్మ రసంలో కలిపాను.. అతడు దానిని తాగలేదు. దీంతో సాంబార్లో క్రిమిసంహారక మందును కలిపాను. అతడు తాగి చచ్చిపోయాడు” అని అమ్మూబీ వాయిస్ మెసేజ్ ఆమె ప్రియుడికి పంపించింది. ఆ వాయిస్ మెసేజ్ పోలీసులకు లభ్యన్ కావడంతో పోలీసులకు బలమైన ఆధారం లభించింది. దీని ప్రకారం లోకేశ్వరన్, అమ్ము ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.