రేపు ఏలూరుకు డబ్ల్యూహెచ్వో బృందం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధితో జనాలు పిట్టల్లా ఎక్కడికక్కడ పడిపోతున్నారు. రెండ్రోజులుగా అసలు ఈ వ్యాధేంటి..? ఎందుకిలా వస్తోంది..? అనేదానిపై వైద్యులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ తరుణంలో ఏలూరులో అసలేం జరుగుతోంది..? జనాలకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు..? ఇంతకీ ఆ వింత వ్యాధి ఏంటి..? అని తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైద్య బృందం మంగళవారం […]

Written By: Suresh, Updated On : December 7, 2020 6:51 pm
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధితో జనాలు పిట్టల్లా ఎక్కడికక్కడ పడిపోతున్నారు. రెండ్రోజులుగా అసలు ఈ వ్యాధేంటి..? ఎందుకిలా వస్తోంది..? అనేదానిపై వైద్యులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే 443 మందికి పైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ తరుణంలో ఏలూరులో అసలేం జరుగుతోంది..? జనాలకు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు..? ఇంతకీ ఆ వింత వ్యాధి ఏంటి..? అని తెలుసుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైద్య బృందం మంగళవారం నాడు ఏలూరుకు రానుంది. ఈ బృందం ఏలూరులో వింత వ్యాధిగా సంచలనం రేపుతున్న వైనంపై అధ్యయనం చేయనుంది.