Homeజాతీయం - అంతర్జాతీయంరాజ్యసభకు సుశీల్ కుమార్ మోదీ ఎన్నిక

రాజ్యసభకు సుశీల్ కుమార్ మోదీ ఎన్నిక

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశృల్ కుమార్ మోదీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిజానికి ఈ నెల 14న ఎన్నిక జరగాల్సి ఉన్నా.. ప్రతిపక్షం నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో సుశీల్ పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ మధ్య ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజార్టీ రావడంతో సుశీల్ ఎన్నిక లాంచనమే అని ముందు నుంచీ భావిస్తూనే ఉన్నారు. సుశీల్ కుమార్ మోదీకి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version