
సింగర్ సునీత ఈరోజు ఉదయం ఓ బిజినెస్ మ్యాన్‌తో నిశ్చితార్థం చేసుకుందనే న్యూస్ సడెన్ గా బయటకు రావడంతో అందరూ చిన్నపాటి షాక్ కి గురి అయ్యారు. రెండో పెళ్ళి గురించి ఎప్పుడూ పాజిటివ్ గా మాట్లాడని సునీత.. ఉన్నట్టుండి ఇలా కాబోయే భర్తను పరిచయం చేయడం.. మొత్తానికి ఓ బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వెంటనే జరిగిపోయాయి.
Also Read: 42 ఏళ్ల వయసులో సింగర్ సునీతకు రెండో పెళ్ళి !
అయితే సునీతను రెండో పెళ్లి చేసుకుంటున్న ఆ వ్యక్తి ఎవరా.. అని నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. వరుస కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ సునీత పెళ్లిచేసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ వ్యక్తి పేరు రామ్ వీరపనేని. పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఇతను.. డిజిటల్ మీడియాలో బిజినెస్ మెన్ గా బాగానే రాణిస్తున్నాడు. యూట్యూబ్‌లో మ్యాంగో ఛానల్ ఓనర్ గానూ, అలాగే వాక్కెడౌట్ మీడియా సంస్థ అదినేతగానూ రామ్ వీరప్పనేనిది సక్సెస్ ఫుల్ జర్నీ.
Also Read: పూనమ్ కౌర్ ట్వీట్.. ఆ హీరోపైనేనా?
ఇక రామ్ వీరప్పనేనిది కూడా రెండో వివాహమేనని తెలుస్తోంది. ఆయనకు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా టాలీవుడ్ సోషల్ మీడియాలో రామ్ వీరపనేనిది కీలక పాత్ర. ఇక సునీతకు ఆయన మొదటి నుండి మంచి స్నేహితుడు. పదిహేను సంవత్సరాల నుండి సునీతతో ఆయనకు పరిచయం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం: సినిమా