ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళ రూ.50 వేలు పొగొట్టుకుంది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఆన్ లైన్ లో ఫుడ్ కొనుగోలు చేస్తే రూ. రూ.10 డిస్కౌంట్ అనే ఆఫర్ వలలో పడింది. దీంతో ఆ ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా రూ. 50వేలు తన అకౌంట్ నుంచి డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో షాక్ కు గురైన ఆమె సదరు కంపెనీకి ఫోన్ చేసి అడగ్గా తమకు ఎలాంటి నగదు రాలేదని చెప్పింది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెబుతున్నా కొందరు మోసపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా అనుమానిత లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.