కేంద్రంతో రేపు రైతుల చర్చలు: రద్దువైపే మొగ్గు..?

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టంలో సంస్కరణపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తుండగా రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు మినహా దేనికి ఒప్పుకోమని అంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన మంగళవారానికి 34వ రోజుకు చేరుకుంది. ఈనెల 30న కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో రైతులు ఓకే చెప్పారు. అయితే ఈ చర్చల్లో కేంద్ర […]

Written By: Suresh, Updated On : December 29, 2020 11:10 am
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం మరోసారి చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టంలో సంస్కరణపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తుండగా రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను రద్దు మినహా దేనికి ఒప్పుకోమని అంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన మంగళవారానికి 34వ రోజుకు చేరుకుంది. ఈనెల 30న కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో రైతులు ఓకే చెప్పారు. అయితే ఈ చర్చల్లో కేంద్ర ఎన్ని ప్రతిపాదనలు చెప్పినా రద్దు వైపు మొగ్గు చూపుతామని రైతులు అంటున్నారు. మూడు చట్టాలు రద్దు చేయడం, ఎంఎస్పీకి గ్యారెంటీ ఇవ్వడం అనే అంశాలు అజెండాలో ఉంచాలన్నదే తమ డిమాండ్ అని అంటున్నారు.