మహారాష్ట్రలో కుండపోత వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పుణే డివిజన్‌లోని సాంగ్లీ, సతారా, షోలాపూర్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం తెలపింది. ఇంకా అనేక మంది వరదలో గల్లంతయ్యారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత ఇళ్లు పూర్తిగా నేలకూలాయి. ఇప్పటివరకు 2319 ఇళ్లు ధ్వరసమైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వర్షాలతో పంట నష్టం తీవ్రంగా సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా 57 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని అధికారులు వెల్లడించారు.