ఇక చైనావోడికి బ్యాండ్ బాజే! మోడీ మదిలో మరో అస్త్రం

మన పక్కలో బల్లెంలో తయారైన చైనాకు  మరోమారు  మైండ్ బ్లాంక్  చేసేందుకు ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారు..ఈ ఆలోచన కనుక వర్క్ అవుట్ అయితే ఇక చైనాకు బ్యాండ్ బాజే.. తక్కువ ధరకు  ప్లాస్టిక్  సామాన్లు అంటూ వచ్చి  ఇండియాలో అడుగుపెట్టిన చైనావోడు.. ఇప్పుడు ప్రతీ రంగంలోనూ పాతుకుపోయాడు. ఎంతలా అంటే చైనా వస్తువు లేనిదే మనం బ్రష్ కూడా పట్టలేనంతగా.. తినే నూడిల్స్ దగ్గర నుంచి  పడుకునే బెడ్ షీట్ దాక చైనాదే  గుత్తాధిపత్యం.. ఇక […]

Written By: NARESH, Updated On : October 16, 2020 12:44 pm
Follow us on

మన పక్కలో బల్లెంలో తయారైన చైనాకు  మరోమారు  మైండ్ బ్లాంక్  చేసేందుకు ప్రధాని మోడీ ఆలోచన చేస్తున్నారు..ఈ ఆలోచన కనుక వర్క్ అవుట్ అయితే ఇక చైనాకు బ్యాండ్ బాజే.. తక్కువ ధరకు  ప్లాస్టిక్  సామాన్లు అంటూ వచ్చి  ఇండియాలో అడుగుపెట్టిన చైనావోడు.. ఇప్పుడు ప్రతీ రంగంలోనూ పాతుకుపోయాడు. ఎంతలా అంటే చైనా వస్తువు లేనిదే మనం బ్రష్ కూడా పట్టలేనంతగా.. తినే నూడిల్స్ దగ్గర నుంచి  పడుకునే బెడ్ షీట్ దాక చైనాదే  గుత్తాధిపత్యం.. ఇక ఎలక్ట్రానిక్స్  అయితే చెప్పనక్కర్లేదు. మనం వాడే సెల్ ఫోన్ నుంచి ల్యాప్ ట్యాప్ వరకు 90శాతం చైనావే… వస్తువులు అమ్ముకుంటున్నాడు ఏదో పోనిద్దాంలే అనుకుంటే మన దాయాది పాకిస్తాన్ కు  ఆర్థిక సాయం చేస్తూ రెండు దేశాలు కలిసి మన పైనే బార్డర్లో కయ్యానికి కాలు దువ్వుతున్నారు..

Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. పూర్తిస్థాయి సర్వీసులు ఎప్పటినుంచంటే..?

* మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి..
మన ప్రధాని  మోడీ అలర్ట్ గా ఉండి చైనా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.  సరిహద్దు ఉద్రిక్తతకు కారణమైన చైనా ను వాణిజ్య పరంగా  దెబ్బ కొట్టేలా కేంద్ర సర్కార్  మరో స్కెచ్ రెడీ  చేస్తోంది. టిక్ టాక్,  పబ్ జీ  సహ చైనా కు చెందిన 177యాప్ లను గంపగుత్తగా నిషేధించి ఆర్థికంగా గట్టి దెబ్బ కొట్టిన రీతిలో మొబైల్ ఫోన్ల దిగుమతులపై పాచిక ప్రయోగించాలని కసరత్తు చేస్తోంది. దీంతో దేశీయ కంపెనీలకు పరోక్షంగా ఊతమిచ్చేందుకు వీలవుతోందని భావిస్తోంది. నిషేధించడంలో ఏమైనా ఇబ్బందులుంటే ఆంక్షల విధింపు ద్వారానైనా వాటని కట్టడి చేయాలని చూస్తోంది.

* వర్క్ అవుట్ అవుతుందా.. చైనా ఊరుకుంటుందా..?
చైనా నుంచి దిగుమతి అవుతున్న వాటిలో  మెజార్టీ భాగం స్మార్ట్ ఫోన్లదే. వాటిపై ఏదో రకంగా నిషేధం విధిస్తే భారత దేశీయ కంపెనీలతో పాటు ఇతర దేశాలకు చెందిన శాంసంగ్, నోకియా వంటి వాటికి గిరాకీ పెరుగుతుందని నిపుణుడు పి.ఎల్. పరాశరన్  చెబుతున్నారు..  అవేంటో ఆయన మాటాల్లోనే.. “చైనా యాప్  లను నిషేధించినప్పుడు దానిని సమర్థించుకునేందుకు తగిన ప్రాతిపదిక భారత ప్రభుత్వం వద్ద ఉంది.  ఆ యాప్లు సమాచారాన్ని వేరేవారికి చేరవేస్తున్నాయి కాబట్టి గోప్యతకు ముప్పు ఉందనే వాదన గట్టిగా చాటగలిగాం.  ఫలానా దేశం నుంచి ఉత్పత్తయ్యాయనే  ఏకైక కారణంతో స్మార్ట్ ఫోన్ల దిగుమతులపై ఆంక్షలు విధించలేం. ఇంకేదైనా బలమైన అంశాలను సమాచార సాంకేతిక (ఐటీ) చట్టం కింద ఆధారంగా చూపిస్తే ఇది సాధ్యమవుతుంది.”అంటున్నారు. అయితే నిషేధం విధించినా అప్పటికప్పుడు లక్షల్లో వేరే కంపెనీల ఫోన్లను సరఫరా చేయడం ఆషామాషీ విషయమా అనే డౌట్లు లేకపోలేదు.. చైనా యాప్ ల నిషేధం తర్వాత షియామీ వంటి స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. తమ ఫోన్లు భారత్ లో తయారైనట్లు చెబుతూ షియామీ వెబ్ సైట్లో దిగువ భాగాన పెద్ద అక్షరాల్లో ప్రదర్శించింది. భారత్ లో  విక్రయించే స్మార్ట్ ఫోన్లలో 99శాతం, టీవీల్లో 85శాతం లోకల్ గా తయారైనవేనని, తమ కర్మాగారాల్లో 30,000 మందికి పైగా ఇండియన్లకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పాయి.

Also Read: జగన్ లేఖ: అమెరికాలోనూ ప్రకంపనలు.. ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు?

* చైనా మొబైల్ మార్కెట్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే?
చైనా కు చెందిన షియామీ,  ఓపో,  వన్  ప్లస్, వివో, లెనోవో లాంటి కంపెనీలు భారత్లో మొబైల్ ఫోన్  మార్కెట్ లో చక్రం తిప్పుతున్నాయి.  మన స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో ఒక్క షియామీ వాటాయే 20శాతం.. దేశంలో ఏటా అమ్ముడయ్యే స్మార్ట్  ఫోన్లు సుమారు 15.80కోట్లు. వీటి విలువ  రూ.2,12,976కోట్లు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. వీటిలో చైనా వాటా దాదాపు 75శాతం . రూపాయల్లో 1,39,536 కోట్లు..  చైనా స్మార్ట్ ఫోన్లను నిషేధిస్తే లావా, కార్బన్,  మైక్రోమాక్స్ వంటి దేశీయ కంపెనీలకు మేలు చేకూరుతుంది. అయితే ప్రస్తుతం ఇండియాలో వీటి వాటా ఒక శాతం కంటే తక్కువ కావడం విచారకరం.