spot_img
Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Vs Dhurandhar 2: 'ధురంధర్' పేరు పెట్టుకుంటే...

Ustaad Bhagat Singh Vs Dhurandhar 2: ‘ధురంధర్’ పేరు పెట్టుకుంటే సరిపోదు.. ఆ ప్లానింగ్ ‘ఉస్తాద్’ రేంజ్‌లో ఉండాలి!

Ustaad Bhagat Singh Vs Dhurandhar 2: సాధారణంగా మన దగ్గర పెద్ద హీరో సినిమా వస్తుందంటే, అది థియేటర్లోకి వచ్చే వరకు ఎవరికీ నమ్మకం ఉండదు. “డ్యూడ్.. ఫైనల్ కాపీ ఇంకా రాలేదంట”, “సెన్సార్ వాళ్ళు ఏదో సీన్ కట్ చేయమన్నారంట” అనే వార్తలు వినకపోతే మనకి ముద్ద దిగదు. కానీ మన హరీష్ శంకర్ గారు మాత్రం ఈసారి అందరికీ షాక్ ఇచ్చారు.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

ఉస్తాద్ ‘ముందస్తు’ హంగామా!

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులు ఎప్పుడో అయిపోయాయట. అంటే.. రిలీజ్ డేట్ కంటే ముందే సినిమా రెడీ! సాధారణంగా ప్రొడ్యూసర్లు రిలీజ్ ముందు రోజు గుడికి వెళ్లి మొక్కుకుంటారు “దేవుడా.. ల్యాబ్ నుంచి హార్డ్ డిస్క్ టైమ్‌కి రావాలి” అని… కానీ ఇక్కడ హరీష్ శంకర్ మాత్రం హాయిగా కాలు మీద కాలు వేసుకుని “సినిమా రెడీ.. ఎప్పుడు వేయమంటే అప్పుడు వేస్తాం” అన్నట్టు కూర్చున్నారు. దీన్ని చూసి ఇండస్ట్రీ జనాలు “అదేంటి.. చివరి నిమిషంలో హడావిడి లేకపోతే అది అసలు టాలీవుడ్ సినిమానేనా?” అని ఆశ్చర్యపోతున్నారు.

బాలీవుడ్ ‘దురంధర్’ కష్టాలు..

ఇక మనకంటే పక్కా ప్లానింగ్‌తో ఉంటారని చెప్పుకునే బాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ధురంధర్ 2 టీమ్ ఇప్పుడు మన పాత స్టైల్‌ని ఫాలో అవుతున్నట్టుంది. రిలీజ్ దగ్గరకు వస్తున్నా ఫైనల్ కట్ లేదట.. పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదట. బహుశా వాళ్ళు కూడా “మన సినిమా అంటే మనమే ప్లాన్ చేసుకోవాలి.. టాలీవుడ్ వాళ్ళు ఎందుకు అడ్వాన్స్‌డ్ అయిపోతున్నారు?” అని కాస్త జెలసీ ఫీల్ అవుతున్నారేమో!

ఒకప్పుడు మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి “సినిమాని టైమ్‌కి ఎలా ఫినిష్ చేయాలో కొంచెం కోచింగ్ ఇస్తారా?” అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ఇండస్ట్రీ పద్ధతి మారింది. ఒకప్పుడు “సినిమా రిలీజ్ అవుతుందా లేదా?” అనే టెన్షన్ ఉండేది, ఇప్పుడు “సినిమా ఎప్పుడో రెడీ అయింది కదా.. ఇక కలెక్షన్లు ఎన్ని వస్తాయో?” అనే లెక్కల్లో ఉన్నారు.

బాలీవుడ్ వాళ్ళకి నా చిన్న సలహా.. ‘ధురంధర్’ అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు బ్రదర్.. ఆ ప్లానింగ్ కూడా ఉస్తాద్ రేంజ్‌లో ఉండాలి!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version