spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఆ యువకుడి మాటలను మర్చిపోలేకపోతున్న పవన్!

Pawan Kalyan: ఆ యువకుడి మాటలను మర్చిపోలేకపోతున్న పవన్!

Pawan Kalyan: దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పథకాన్ని ప్రారంభించిన తర్వాత దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు ఆ ఇద్దరు నేతలు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, సంక్షేమ పథకాల గురించి దివ్యాంగులను అడిగి తెలుసుకున్నారు. ఓ యువకుడితో మాట్లాడిన వీడియోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ యువకుడు చెప్పిన మాటలను సులభంగా మరిచిపోలేనట్టు వీడియోలో షేర్ చేశారు.

Also Read: 17 ఏళ్లు దాటింది.. రాజస్థాన్ ఈసారైనా రాజసాన్ని చూపుతుందా? బలాలేంటి?బలహీనతలేంటి?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన వీడియోలో సారాంశం ఇది. ” ఈరోజు ఉదయం మంగళగిరి నుంచి పెనుమాకకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కాను. అయితే ఒక మంత్రిగా కాదు.. దివ్యాంగుల సమస్యలు వినాలనుకునే ఓ వ్యక్తిగా బస్సు ఎక్కాను. దివ్యాంగ సోదర, సోదరీమణులతో కలిసి కూర్చున్నాను. బస్సులో కొందరు పనికి వెళ్తున్నారు. మరికొందరు మార్కెట్ కు వెళ్తున్నారు. ఇంకొందరు తమ రోజువారి పనులకు వెళ్తున్నారు. బస్సు నడుస్తున్న కొద్ది సంభాషణలు కూడా కొనసాగుతూ వచ్చాయి. ఆ మాటలు నిజాయితీగా పైకి కనబడని ఒక రకమైన శక్తితో నిండి ఉన్నాయి. అయితే అందరితో మాట్లాడిన దానికంటే ఓ యువకుడితో సాగిన సంభాషణ నా మదిలో బాగా నిలిచిపోయింది. స్పెషల్ ఎడ్యుకేటర్ అయ్యేందుకు జేఎన్టీయూలో చదువుతున్న ఓ యువకుడితో జరిగిన సంభాషణ అది. ఆ యువకుడు నా వైపు తిరిగి.. నేను అంత సులభంగా మర్చిపోలేని ఒక మాట అన్నాడు. తను అమర్త్యసేన్ చెప్పిన డబుల్ హ్యాండీక్యాప్ అంశాన్ని ప్రస్తావించాడు. సాధారణ జీవితం కంటే.. దివ్యాంగులు రెండింతల ఆర్థిక భారం పడాల్సి ఉంటుందని చెప్పాడు. ఆ యువకుడు చెప్పిన మాటలు తనను కదిలించాయని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. అయితే ఈ దివ్యాంగ శక్తి పథకం గురించి సదరు యువకుడు మాట్లాడుతూ దివ్యాంగుల పై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఈ పథకం ద్వారా తమకు ఇచ్చారని చెప్పడం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకంలో భాగంగా దివ్యాంగులకు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. దివ్యాంగ శక్తి అనేది రవాణా కోసం ఉద్దేశించినది కాదని.. దివ్యాంగుల ఆత్మస్థైర్యం కోసం అని అభివర్ణించారు పవన్ కళ్యాణ్. అయితే ఆ యువకుడి గురించి ప్రత్యేక ప్రస్తావన చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version