ప్రతిపక్షాల స్వార్థపూరితం బయటపడింది: మోదీ
పూల్వామా ఘటనపై పాక్ నిజం ఒప్పుకోవడంతో దేశంలోని ప్రతిపక్షాల స్వార్థపూరిత రాజకీయం బయటపడిందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోడీ నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయన్నారు. తమ బిడ్డల్ని కోల్పోయామన్న వేదనలో ఉంటే కొందరు మాత్రం ఎలాంటి బాధ లేకుండా స్వార్థ ప్రయోజనాల […]
Written By:
, Updated On : October 31, 2020 / 12:24 PM IST

పూల్వామా ఘటనపై పాక్ నిజం ఒప్పుకోవడంతో దేశంలోని ప్రతిపక్షాల స్వార్థపూరిత రాజకీయం బయటపడిందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి అన్నారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోడీ నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయన్నారు. తమ బిడ్డల్ని కోల్పోయామన్న వేదనలో ఉంటే కొందరు మాత్రం ఎలాంటి బాధ లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శలు చేశారన్నారు.