
కరోనా ప్రభావంతో కొన్ని రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధిస్తుండడంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. బాణసంచాపై నిషేధాన్ని ఎత్తివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లకు లేఖలు రాశారు. దేశంలోని 90 శాతం బాణసంచా తమిళనాడులోనే తయారవుతుందని, దీనిపై ఎనిమిది లక్షల మంది కార్మికులపై ప్రభావం పడుతుందని తెలిపారు. తమిళనాడు కేవలం పర్యావరణ హితమైన టపాసులను మాత్రమే తయరు చేస్తోందని, వీటి వల్లా పర్యావరణ కాలుష్యం తలెత్తే అవకాశాం లేదని తెలిపారు.