https://oktelugu.com/

‘బురద’లో దిగబడిన కారు.. హైదరాబాద్ లో బయటపడుతుందా?

తెలంగాణలో రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌‌. ఆయన వేసే ఎత్తులు.. ఆయన చేసే రాజకీయం ఎవరి ఊహకు అందనివి. ఆయన మాటల గారడీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీని కాపాడుకుంటూ.. తిరుగులేని రాజకీయ నేతగా పేరొందిన లీడర్‌‌. ఎన్నికలు ఏవైనా.. ఒక్క ప్రచారంతో తమ వైపు ఫలితాలను తిప్పగల మేధావి. ఇప్పటివరకు అన్నింటా పైచేయి సాధించిన కేసీఆర్‌‌కు ఒక్కసారిగా గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి.మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ నిన్నా మొన్నటి గ్రేటర్‌‌లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 08:15 AM IST
    Follow us on

    తెలంగాణలో రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌‌. ఆయన వేసే ఎత్తులు.. ఆయన చేసే రాజకీయం ఎవరి ఊహకు అందనివి. ఆయన మాటల గారడీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీని కాపాడుకుంటూ.. తిరుగులేని రాజకీయ నేతగా పేరొందిన లీడర్‌‌. ఎన్నికలు ఏవైనా.. ఒక్క ప్రచారంతో తమ వైపు ఫలితాలను తిప్పగల మేధావి. ఇప్పటివరకు అన్నింటా పైచేయి సాధించిన కేసీఆర్‌‌కు ఒక్కసారిగా గడ్డుపరిస్థితులు ఎదురయ్యాయి.మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    నిన్నా మొన్నటి గ్రేటర్‌‌లో టీఆర్‌‌ఎస్‌ జెండా రెపరెపలాడిస్తామని బీరాలు పలికిన అధినేత కేసీఆర్‌‌.. ఇప్పుడు మెత్తబడిపోయారు. వందకు పైగా సీట్లు సాధించి మేయర్‌‌ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్న ధీమా ఇప్పుడు వారిలో కనిపించడం లేదు. ఇదంతా ఎందుకంటారా..! ఇటీవల మహానగరాన్ని ముంచెత్తిన వరదలు పార్టీకి, ప్రభుత్వానికి మైనస్‌ను తెచ్చిపెట్టాయి. ఒక్క వానతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. వేల కోట్లు కుమ్మరించి అభివృద్ధి పనులు చేస్తున్నామని గొప్పగా చెప్పుకున్న టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టే విధంగా అభివృద్ధి మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడు వరదలు మిగిల్చిన బురద మాత్రమే మిగిలింది. అంతేకాకుండా, ప్రభుత్వ ముందుచూపు కొరవడడంతోనే నగరంలో ఇంతటి పెను విపత్తు సంభవించిందని ప్రజలంతా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఇప్పుడు తిరగబడుతున్నారు. సుమారు పదివేల వరకు వరద సహాయం ప్రకటించినా ప్రజల్లో మాత్రం అసంతృప్తి తగ్గలేదు. పోనీ.. ఆ సాయం కూడా అందరికీ అందిందా అంటే అదీ లేదు.

    Also Read: బండి సంజయ్ కోసం ఒంటికి నిప్పంటించుకున్న కార్యకర్త మృతి

    ఈ వరద సహాయంలో అవినీతి జరిగిందంటూ, కార్పొరేటర్ల ఇళ్ల ముందు ధర్నాలు చేసే వరకు పరిస్థితి వచ్చింది. దీంతో ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలకలా తయారైంది. ఇప్పటికిప్పుడు గ్రేటర్‌‌లో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని భావిస్తోంది.  ఎన్నికలను మరికొంతకాలం వాయిదా వేయడమే సరైన మార్గం అంటూ టీఆర్ఎస్ శ్రేణుల నుంచి అధినేత కేసీఆర్‌‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: కేసీఆర్‌‌కే తలనొప్పి తెచ్చాయే!

    ప్రజలు ఈ వరద.. బురద బారి నుంచి బయటపడ్డాకే ఎన్నికల గురించి ఆలోచించడం మంచిదని టీఆర్‌‌ఎస్‌ నాయకుల్లో వచ్చిందట. అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్‌‌లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే.. మిగతా పార్టీలు మాత్రం ఈ టైంలో ఎన్నికలు జరిగితేనే తమకు కలిసివస్తుందని ఉవ్విల్లూరుతున్నాయి. ఏది ఏమైనా టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఇన్నాళ్లు సాధించిన ఇమేజీ కాస్త ఇప్పుడు ఈ బురదలో కలిసిపోయిందనేది అర్థమవుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సాహసిస్తుందా..? లేక కొన్నాళ్లు వెయిట్‌ చేస్తే మంచిదని నిర్ణయిస్తుందా..? ఏం జరుగుతుందో చూడాలి.