ఢిల్లీలో బాణసంచా పేల్చుడు బంద్‌

దీపావళి సందర్భంగా న్యూ ఢిల్లీలో బాణసంచా పేల్చడాన్ని నిషేధించినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో కరోనా విజృంభించడంతో పాటు వాతావరణ కాలుష్యం పెరగడంతో టపాకాయలను పేల్చవద్దని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు నగరంలో వైద్య సదుపాయాలను పెంచామన్నారు. ఐసీయూ పడకల పెంచేందుకు తమ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై డిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందని, దీనీపై సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేస్తామన్నారు. కరోనా పరీక్షలపై మరింత దృష్టి పెట్టాలని, కేసులు పెరుగుతున్నా మరణాల రేటు పెరగకుండా […]

Written By: Suresh, Updated On : November 5, 2020 9:03 pm
Follow us on

దీపావళి సందర్భంగా న్యూ ఢిల్లీలో బాణసంచా పేల్చడాన్ని నిషేధించినట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో కరోనా విజృంభించడంతో పాటు వాతావరణ కాలుష్యం పెరగడంతో టపాకాయలను పేల్చవద్దని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు నగరంలో వైద్య సదుపాయాలను పెంచామన్నారు. ఐసీయూ పడకల పెంచేందుకు తమ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై డిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందని, దీనీపై సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేస్తామన్నారు. కరోనా పరీక్షలపై మరింత దృష్టి పెట్టాలని, కేసులు పెరుగుతున్నా మరణాల రేటు పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.