
కర్ణాటకలో ఆగస్టు 11న జరిగిన అల్లర్ల కేసులో బెంగుళూరు మాజీ మేయర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని దేవర జీవన్ హళ్లీ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ సంపత్ సహా 60 మంది నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీనివాసమూర్తి , ఆయన సోదరి ఇంటిపై దాదాపు 4వేల మంది దాడికి దిగారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంపత్ రాజ్ సహా 60 మందిపై కేసు నమోదు చేశారు.