https://oktelugu.com/

కమలం ‘గ్రేటర్’ ఆపరేషన్..కారు పరేషాన్

జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవటానికి కమలనాథులు వ్యూహలు రచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దించి దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. Also Read: అజ్ఞాతవాసి పవన్ తో బీజేపీకి దెబ్బ పడుతోందా? బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఇన్చార్జీలను నియమించింది. వీరిలో నలుగురు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 12:15 pm
    Follow us on

    BJp TRS

    జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవటానికి కమలనాథులు వ్యూహలు రచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దించి దూకుడు పెంచినట్లు తెలుస్తోంది.

    Also Read: అజ్ఞాతవాసి పవన్ తో బీజేపీకి దెబ్బ పడుతోందా?

    బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఇన్చార్జీలను నియమించింది. వీరిలో నలుగురు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. మరొకరు కర్నాటక రాష్ట్రానికి చెందిన నేత కావటం గమనార్హం. నిజానికి జీహెచ్ఎంసి ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పరిశీలకులు చేయగలిగేదేమీ ఉండదు. కానీ ఇక్కడే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

    జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో కమల దళపతి పర్యటన ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

    Also Read: రూ.310 కోట్ల ఖర్చా.. ధనిక రాష్ట్రమా మాజాకా?

    హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పాటు సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా ఉత్తరాధివారి ప్రభావం ఎక్కువగానే ఉంది. వీరిలో పశ్చిమబెంగాల్, మార్వాడీ, ఢిల్లీ, గుజరాత్, ముంబై మూలాలున్న వారే చాలా ఎక్కువని బీజేపీ అంచనా లెక్కలేసింది. అంటే హైదరాబాద్+సికింద్రాబాద్ లో సుమారు 20 లక్షల మంది ఉత్తరాధి రాష్ట్రాల వారి జనాభానే ఉందట. దాంతో వాళ్ళ ఓట్లపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. ఏ ఏ డివిజన్లలో ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారనే విషయమై వివరాలు సేకరిస్తోంది.

    బండి సంజయ్ దూకుడుతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీజేపీ బలపడుతోందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారట. తాజాగా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండుతో చలో అసెంబ్లీకి పిలుపునిచ్చి సంజయ్ సక్సెస్ అయిన విషయాన్ని పార్టీ క్యాడర్ గుర్తుచేస్తోంది. సంజయ్ దూకుడు గ్రేటర్‌లో బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతోందన్న వాదన వినిపిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    జీహెచ్ఎంసీ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న బీజేపీ.. గ్రేటర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితేనే.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పట్టు బిగించవచ్చని భావిస్తోంది.