
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 29,163 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 449 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,74,290గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,30,519కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,53,401 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 82,90,370 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి వరకు 30 వేలల్లో ఉన్న కేసులు 29 వేలకు దిగడం ఊరటనిస్తోంది. కాగా మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. రికవరీ రేటు 93.42శాతంగా ఉంది.