బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా విజయ్ సిన్హా ఎన్నిక

బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజయ సిన్హా ఎన్నికయ్యారు. బీహార్ లో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ తరుపున విజయసిన్హా పోటీ చేయగా, ఆర్జేడీ తరుపున ఎమ్మల్యే బిహారీ చౌదరిని ప్రకటించింది. అయితే ఆర్జేడీ ఎమ్మెల్యే ఇటీవల బీహార్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థతిని తయారు చేశారు. స్పీకర్ పదవికి వాయిస్ ఓటింగ్ ద్వారా అభ్యర్థిని ఎన్నుకునే పద్ధతిని తిరస్కరించాడు. కాగా చివరకు జరిగిన ఎన్నికల్లో విజయ్ సిన్హాకు 126 ఓట్లు, మహాఘట్ బంధన్ అభ్యర్థి […]

Written By: Suresh, Updated On : November 25, 2020 2:38 pm
Follow us on

బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజయ సిన్హా ఎన్నికయ్యారు. బీహార్ లో జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ తరుపున విజయసిన్హా పోటీ చేయగా, ఆర్జేడీ తరుపున ఎమ్మల్యే బిహారీ చౌదరిని ప్రకటించింది. అయితే ఆర్జేడీ ఎమ్మెల్యే ఇటీవల బీహార్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థతిని తయారు చేశారు. స్పీకర్ పదవికి వాయిస్ ఓటింగ్ ద్వారా అభ్యర్థిని ఎన్నుకునే పద్ధతిని తిరస్కరించాడు. కాగా చివరకు జరిగిన ఎన్నికల్లో విజయ్ సిన్హాకు 126 ఓట్లు, మహాఘట్ బంధన్ అభ్యర్థి అవధ్ బిహారీ చౌధురికి 114 ఓట్లు వచ్చాయి. దీంతో విజయ్ సిన్హాను విజేతగా ప్రకటించారు. అనంతరం సీఎం నితీశ్, విపక్ష నేత తేజస్వీ యాదవ్ స్పీకర్ ను తన స్థానంలో కూర్చోబెట్టారు.