
కరోనా వ్యాక్సిన్లపై ఎలాంటి పుకార్లు నమ్మొద్దని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ వీసీ సోమానీ స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ వినియోగం వల్ల నపుంసకులుగా మారుతున్నాయన్న వార్తలు అవాస్తవమన్నారు. ఈరోజు ఉదయం కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అనుమతి వచ్చిందని, వీటి వినియోగం సురక్షితమేనన్నారు. ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి తప్ప ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవన్నారు.