https://oktelugu.com/

కోవిడ్ రహితదేశంగా కాబోతున్న భారత్: ప్రధాని మోడీ

భారతదేశం కోవిడ్ రహిత దేశంగా మారబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం కోవీషీల్డ్, కోవాగ్జిన్, వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మాట్లాడారు. కరోనా కోరల్లో చిక్కకున్న భారత్ ను దేశీయ శాస్ర్తవేత్తలు ఎంతో శ్రమించి వ్యాక్సిన్లు తయారు చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి, భారతీయులందరికీ అభినందనలు అని చెప్పారు. అత్యవసర వినియోగానికి దేశీయ వ్యాక్సిన్లు సిద్ధమవడం గర్వకారణమన్నారు. దీనిని భట్టి భారత్ ఏ స్థాయిలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 3, 2021 / 12:28 PM IST
    Follow us on

    భారతదేశం కోవిడ్ రహిత దేశంగా మారబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం కోవీషీల్డ్, కోవాగ్జిన్, వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మాట్లాడారు. కరోనా కోరల్లో చిక్కకున్న భారత్ ను దేశీయ శాస్ర్తవేత్తలు ఎంతో శ్రమించి వ్యాక్సిన్లు తయారు చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి, భారతీయులందరికీ అభినందనలు అని చెప్పారు. అత్యవసర వినియోగానికి దేశీయ వ్యాక్సిన్లు సిద్ధమవడం గర్వకారణమన్నారు. దీనిని భట్టి భారత్ ఏ స్థాయిలో నైపుణ్య విలువలు కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కరోనా సమయంలో వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ఇతర కరోనా వారియర్స్ దేశ ప్రజలను వైరస్ నుంచి కాపాడారన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు.