నదులకు చిల్లర పైసలు, పండ్లను కానుకగా సమర్పించడానికి గల కారణాలు తెలుసా?

మన పూర్వీకులు పూర్వకాలం నుంచి ఏదైనా నదులు ప్రవహించే వంతెనపై ప్రయాణం చేసేటప్పుడు లేదా నీటి పారుతున్న కాలువల ప్రక్కన ప్రయాణం చేసేటప్పుడు వాటిలో చిల్లర, పండ్లను వేసి నమస్కరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విధంగా నదులకు చిల్లర, పండ్లు తదితర వంటివాటిని సమర్పించడానికి గల కారణాలు ఏమై ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.. Also Read: మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? సాధారణంగా నదులను దైవ సమానంగా భావిస్తాము. ఆ నది […]

Written By: Navya, Updated On : January 5, 2021 4:45 pm
Follow us on

మన పూర్వీకులు పూర్వకాలం నుంచి ఏదైనా నదులు ప్రవహించే వంతెనపై ప్రయాణం చేసేటప్పుడు లేదా నీటి పారుతున్న కాలువల ప్రక్కన ప్రయాణం చేసేటప్పుడు వాటిలో చిల్లర, పండ్లను వేసి నమస్కరించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విధంగా నదులకు చిల్లర, పండ్లు తదితర వంటివాటిని సమర్పించడానికి గల కారణాలు ఏమై ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?

సాధారణంగా నదులను దైవ సమానంగా భావిస్తాము. ఆ నది గుండా ప్రవహించే నీరు ఎన్నో జలచరాలకు, జీవరాశులకు దాహాన్ని తీర్చే నది దేవతగా భావిస్తారు. అంతేకాకుండా ఆ నదుల ద్వారా ప్రవహించే నీటిని ఉపయోగించి పంటలు పండించడం వల్ల నదులను దైవ సమానంగా భావించి పూజలు చేస్తుంటాము. నదులలో ప్రయాణం చేసేటప్పుడు కొందరు నదులలో కి పైసలను వేయడం మనం చూస్తుంటాము. పూర్వకాలంలో అయితే రాగి నాణాలతో తయారు చేసిన పైసలు వాడుకలో ఉండేవి. ఆ రాగి పైసలను నీటిలో వేయడం ద్వారా ఆ రాగి వల్ల నీరు కలుషితం కాకుండా మరింత స్వచ్ఛంగా ఉండేవి. ఆ స్వచ్ఛమైన నదీజలాలను తాగినప్పుడు జలచరాలకు లేదా మానవాళికి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని భావించడం వల్ల నదులలో పైసలను వేసేవారు. అయితే ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతూనే ఉంది.

Also Read: శివుని కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా?

మరి కొంతమంది నదులలో ప్రయాణించేటప్పుడు ఆనందికి పూజలు చేసే కొబ్బరికాయను కొట్టి అందులోనే వేయమని చెబుతుంటారు. ఈ విధంగా కొబ్బరికాయను, లేదా వివిధ రకాల పండ్లను నది దేవతకు సమర్పిస్తుంటారు. ఈ విధంగా పండ్లను నదికి సమర్పించడం వల్ల నదిలో ఉన్న ఎన్నో జలచరాలకు ఆహారాన్ని అందించిన వారవుతారు. అందుకోసమే నీటిలో పండ్లను వదలమని చెబుతారు.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం