
దేశవ్యాప్త నిరసనలకు కారణమైన వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయంపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌పై ఎలాంటి ఆశలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు సంబంధించి 24 రాజకీయ పార్టీల ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రపతిని కలువనుంది. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న కేంద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 24 రాజకీయ పార్టీలు ఎన్‌డీఏ పరిధిలోని అన్ని పార్టీలతో చర్చించాలని, ప్రధాని మోదీజీ, నితీశ్‌జీపై ఒత్తిడి పెంచాలన్నారు.