
వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏలూరు పరిధిలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. రేపు ఏం జరుగుతుందనే భయాందోళనలను ప్రభుత్వం తొలగించాలని కోరారు. తాగునీటిలో సీసం, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజలు భయపడుతున్నారన్నారు.