
పెళ్లికి హాజరయ్యేందుకు కొంతమంది ఫోర్‌వీలర్‌లో బయలుదేరారు. అది రాత్రి సమయం కావడంతో కారు నడుపుతున్న డ్రైవర్‌కు ఎదురుగా ఉన్నదేదీ కనిపించలేదు. దీంతో కారు నేరుగా నేల బావిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించేనాటికే ఆరుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహారాజ్ పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలోని కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరోముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు.