HomeజాతీయంDiwali: దీపావళి ఒక్కరోజు పండగకాదు.. ఈ తరానికి తెలియని రహస్యం

Diwali: దీపావళి ఒక్కరోజు పండగకాదు.. ఈ తరానికి తెలియని రహస్యం

Diwali: అన్ని పండగలూ ఒకెత్తైతే.. దీపావళి మరో ఎత్తు. ఈ దివ్వెల పండుగ రోజున బాంబుల మోత మోగిస్తూ.. దేశవ్యాప్తంగా సాగించే హంగామా మామూలుగా ఉండదు మరి. ప్రతీ ఇంట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ పండుగను ఆస్వాదిస్తారు. అయితే.. ఈ దీపావళి సంబురం ఒక్కరోజుతోనే ముగించేస్తోంది ఈతరం. నిజానికి ఈ మురిపెం ఐదురోజులపాటు కొనసాగాల్సింది అన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసు? మరి, ఆ విశిష్టత ఏంటి? ఐదు రోజులపాటు దివాళీని ఎలా జరుపుకుంటారు అన్నది ఇప్పుడు చూద్దాం.
Diwali
మొదటి రోజు: ఈ రోజును ఆశ్వీయుజ బహుళ త్రయోదశి అంటారు. దీన్నే ధన త్రయోదశి అనికూడా అంటారు. దేవతలు, రాక్షసులు కలిసి మధించిన పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. అందువల్ల ఈ రోజున లక్ష్మిని పూజిస్తారు. అందుకే ఈ రోజున కొంతైనా బంగారం కొంటారు.

రెండో రోజు: ఈ రోజును నరక చతుర్దశిగా పిలుస్తారు. లోక వినాశకారి నరకాసుర సం హారం జరిగిన రోజు. ఈ రోజున ఇళ్లూ, వాకిళ్లూ శుభ్రం చేసుకుంటారు. ఇవాళ స్వాతీ నక్షత్రం సమయంలో.. నీటిలో గంగాదేవి, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే.. నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేస్తారు.

మూడో రోజు : ఈ రోజును దీపావళి అమావాస్యగా జరుపుకోవాలి. ఈ వేళ మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల బెరడు నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేస్తారు. దరిద్ర దేవతను పారదోలేందుకు లక్ష్మీ దేవిని పూజిస్తారు. కొత్త పనులన్నీ ఇవాళ మొదలు పెడతారు.

నాలుగోరోజు: దీపవళి మరుసటి రోజును బలిపాఢ్యమిగా పిలుస్తారు. చతుర్దశి నాడు వామనుడి అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేయగా.. అతను ఈ రోజున తిరిగి భూమ్మీదకు వచ్చాడని పురాణోక్తి. ఈ రోజున బలికి పూజచేస్తారు. శ్రీ కృష్ణుడు గోవర్దన గిరిని ఎత్తి, రేపల్లెను కాపాడిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

ఐదో రోజు: ఈ రోజున భగిని హస్త భోజనం చేస్తారు. అంటే.. పురుషులు తమ అక్కా, చెల్లి చేత్తో భోజనం చేస్తారు. దీనివల్ల మృత్యు భయం తొలగిపోతుందట. యముడు తన చెల్లి చేత భోజనం చేసిన రోజు ఇదేనని చెబుతారు. ఈ విధంగా దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular