Balayya: నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికీ అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్ కి ముస్తాబు అయింది. ఇప్పటికే డిసెంబర్ 2న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. విడుదల తేదీని రేపో, ఎల్లుండో అధికారికంగా ప్రకటిస్తారు. అందుకే, ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు మేకర్స్.

ఈ దీపావళి కానుకగా మరో టీజర్ కూడా వస్తోంది. ఆ తర్వాత నాలుగు రోజులకు రెండో సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ‘అఖండ’ సినిమా ప్రమోషన్లను భారీగానే ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. డిసెంబర్ నెలలో ప్రతివారం ఒక భారీ సినిమా ఉండే అవకాశం ఉంది. అన్ని పెద్ద సినిమాలే. పైగా వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ ‘అఖండ’కు పోటీగా వచ్చేలా కనిపిస్తుంది.
డిసెంబర్ మొదటి వారంలోనే గని కూడా రిలీజ్ కావడానికి సన్నద్ధం అవుతుంది. గని సినిమాకు దర్శకుడు కొత్త అతను. ఇటు బోయపాటి శ్రీను దర్శకుడు. నిజానికి వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నట్టే. బాలయ్య సినిమాల పై పోటీగా వచ్చి నెగ్గిన సినిమాలు గతంలో చాలా ఉన్నాయి. కానీ ఒక ప్రతిభ గల దర్శకుడితో బాలయ్య చేసిన సినిమా పై పోటీగా వచ్చి నెగ్గిన సినిమాలు అరుదు.
అందుకే, బాలయ్య అఖండ పై పుష్పను కూడా రిలీజ్ చేయకుండా ఓ ఒప్పందానికి వచ్చి.. రెండు సినిమాలకు ఓ వారం గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. అలాంటిది.. వరుణ్ తేజ్ తన గని సినిమాను అఖండకు పోటీగా రిలీజ్ చేయాలనుకోవడం కచ్చితంగా పొరపాటే. కాకపోతే, గని కి మరో రిలీజ్ డేట్ దొరకని పరిస్థితి ఉంది. ఎందుకంటే.. డిసెంబర్ రెండో వారంలో ‘పుష్ప’ ఉంది.
ఇక డిసెంబర్ మూడో వారంలో ‘శ్యామ్ సింగ రాయ్’ ఉంది, అలాగే చివరి వారంలో ఖిలాడీ’ విడుదల కానుంది. దాంతో గనిని బాలయ్య సినిమాకు పోటీగా వదులుతున్నారు. అయితే, వరుణ్ తేజ్, బాలయ్యతో కాకుండా రవితేజతో, నానితో పోటీ పడటం బెటర్.