spot_img
Homeబిజినెస్Kia Syros EV: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే మిడిల్ క్లాస్ పీపుల్స్ కు గుడ్ న్యూస్..

Kia Syros EV: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే మిడిల్ క్లాస్ పీపుల్స్ కు గుడ్ న్యూస్..

Kia Syros EV: పెట్రోల్, డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. అయితే తొలుత మార్కెట్లోకి వచ్చిన ఈ కార్ల ధరలు అధికంగా ఉండడంతో చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ కంపెనీల మధ్య పోటీ పెరగడంతో ఒక్కొక్కటి ధరలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా Kia కంపెనీ బడ్జెట్లోనే ఈవీ కారును మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ కార్ గురించి ఇప్పటికే ఆన్లైన్లో ఉండడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దీని ధరపై కూడా అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్లోకి రాబోయే ఈ కారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కొత్తగా రాబోయే Kiya Syros EV డిజైన్ డిఫరెంట్ లుక్ లో ఉండగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన పెట్రోల్ ఆధారిత కారు వాలే కనిపిస్తుంది. కానీ బాక్సి లుక్ తో పాటు స్ట్రైట్ గా ఉన్న లైన్లు SUV లుక్ ను తీసుకొస్తుంది. ఈ కారుకు ఎడమవైపు చార్జింగ్ పోర్టు ఇచ్చారు. 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉండే దీని వెనక ఉన్న బంపర్స్ రీ డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. రూప్ రేయిల్స్ లో మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. ఈ కారులో ఇన్నర్ లో ఉండే స్పెసిఫికేషన్ సౌకర్యవంతంగా ఉంటాయి. 12.3 అంగుళాల స్క్రీన్లు డ్రైవర్కు సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, పనోరమిక్ sunroof వంటివి లగ్జరీ కారు వలె తలపిస్తుంది. వెంటిలేటెడ్ సీడ్స్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.

ఈ కొత్త కియా కారులో 42 kWh, 49 kWh అనే రెండు బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఒకసారి చార్జింగ్ చేస్తే 369 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారు ద్వారా మరో కారుకు చార్జింగ్ అయ్యే విధంగా పవర్ సోర్స్ ను అమర్చారు. అవుట్డోర్ కు వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఫీచర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ యు వి ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే అందించేలా దీనిని మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ.15 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తిగా ప్రీమియం లుక్ లో ఉన్న ఈ కారు తక్కువ ధరకే రావడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇది మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper