Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Pre Release Event Details: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్...

Ustaad Bhagat Singh Pre Release Event Details: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు వచ్చేశాయి.. ముఖ్య అతిథి ఎవరంటే!

Ustaad Bhagat Singh Pre Release Event Details: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ఈ నెల 26 న విడుదల చేయబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అప్డేట్ అధికారికంగా బయటకు వచ్చింది. చాలా మంది ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ […]

Ustaad Bhagat Singh Pre Release Event Details: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ఈ నెల 26 న విడుదల చేయబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అప్డేట్ అధికారికంగా బయటకు వచ్చింది. చాలా మంది ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ని KGF మేకర్స్ హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుంటుంది అనుకున్నారు కానీ, చివరికి ‘ఓజీ’ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేసిన ‘ప్రత్యంగిరా సినిమాస్’ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన మూడవ పాట ప్రోమోని ఈ నెల 4 న విడుదల చేయబోతున్నారు. ఈ పాట కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ పాట హిట్ అవ్వడం తప్పనిసరి.

Also Read: బిఆర్ నాయుడు రూపంలో కూటమికి కొత్త తలనొప్పి!

వారం రోజుల క్రితం విడుదల చేసిన #AuraOfUstaad పాటకు మిశ్రమ స్పందన లభించింది. అభిమానులు సైతం ఈ పాటపై తీవ్రమైన విమర్శలు చేస్తూ రచయితా చంద్రబోస్ , మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయం లో ఈ సినిమా నుండి చార్ట్ బస్టర్ సాంగ్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ పాట హిట్ అవ్వాలని అభిమానులు గట్టిగ కోరుకుంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త బాగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో ఈ నెల 19 న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా రాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇలా ముగ్గురు మెగా హీరోలను ఒకే ఈవెంట్ లో చూసి చాలా రోజులు అయ్యింది. చివరి సారిగా ఈ ముగ్గురు కనిపించింది ‘సైరా నరసింహా రెడ్డి ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే. ఆ తర్వాత కుటుంబం లో జరిగిన ఈవెంట్స్ కి ముగ్గురు కలిసి హాజరయ్యారు కానీ, ఇలా అభిమానులు పాల్గొనే మీటింగ్స్ లో మాత్రం రాలేదు. కాబట్టి మార్చి 19 న జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్. గతంలో పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి కూడా మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ సినిమాకు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper