Homeఎంటర్టైన్మెంట్Geethu Royal: నా జీవితాన్ని రోడ్డు మీదకు లాగేశారు అంటూ యూట్యూబర్ గీతూ రాయల్ ఎమోషనల్...

Geethu Royal: నా జీవితాన్ని రోడ్డు మీదకు లాగేశారు అంటూ యూట్యూబర్ గీతూ రాయల్ ఎమోషనల్ కామెంట్స్!

Geethu Royal: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ప్రముఖ యూట్యూబర్ గీతూ రాయల్(Geethu Royal) తన స్నేహితులతో కలిసి చేసిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయిపోవడం తో ఆమెపై జనాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం లో ఇలాంటి పనులు నిషేధం అని తెలిసినప్పటికీ కూడా , కామన్ సెన్స్ లేకుండా , రీల్స్ పిచ్చి తో ఇలా చేయడం అత్యంత పాపం తో కూడిన పని అని , […]

Geethu Royal: తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ప్రముఖ యూట్యూబర్ గీతూ రాయల్(Geethu Royal) తన స్నేహితులతో కలిసి చేసిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ అయిపోవడం తో ఆమెపై జనాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం లో ఇలాంటి పనులు నిషేధం అని తెలిసినప్పటికీ కూడా , కామన్ సెన్స్ లేకుండా , రీల్స్ పిచ్చి తో ఇలా చేయడం అత్యంత పాపం తో కూడిన పని అని , టీటీడీ ఎన్ని నియమాలు పెట్టినప్పటికీ కూడా ఇలాంటోళ్ళు పాటించడం లేదని , ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తిరుమలలో ఇంకా ఎన్నో ఘోరాలు చూడాల్సి ఉంటుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ టీటీడీ అధికారులను ట్యాగ్ చేసి కామెంట్స్ చేశారు. ఇలా చేసినందుకు టీటీడీ అధికారులు గీతూ రాయల్ పై ఫైర్ అవ్వడమే కాకుండా, ఆమెపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ సందర్భంగా గీతూ రాయల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ ‘మీ అందరికీ ఒక గుడ్ న్యూస్..నాపై టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటారట. సంతోషంగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని, అంత పెద్దదిగా చేసి , నా మీద నెగిటివ్ గా వీడియోలు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పటికే సగం జీవితం పోయింది. ఇక పోయేదానికి కూడా ఏమి మిగల్లేదు జీవితంలో, ఇంకా ఎంతో కొంత ఒకటి రెండు రూపాయిలు మిగిలినందుకు వాటిని కూడా పోగొట్టేయండి , ప్రశాంతంగా ఉండండి అందరూ , సంతోషంగా బ్రతికేయండి ‘ అంటూ చెప్పుకొచ్చింది. ఇది చూసిన తర్వాత నెటిజెన్స్ ఈమె పై ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చేసిన తప్పుని గ్రహించి , ఇక మీదట ఇలా ఎప్పుడూ చేయను, భక్తుల మనోభావాలు దెబ్బ తినుంటే క్షమించండి అని అడగాల్సింది పోయి, రివర్స్ లో ఇలా మాట్లాడుతుందేంటీ అంటూ మండిపడుతున్నారు.

ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం వల్లే , గీతూ రాయల్ ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేకపోయింది. కేవలం యూట్యూబ్ కి , బిగ్ బాస్ రివ్యూస్ కి మాత్రమే పరిమితం అయ్యింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా గీతూ రాయల్ మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. అలా ఆ షో ద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న ఈమెకు ‘బిగ్ బాస్ 6’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షోలో కూడా ఇదే యాటిట్యూడ్ తో కొనసాగి , నాల్గవ వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటికీ ఈమె యాటిట్యూడ్ మార్చుకోలేదంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper