Odisha Viral Fight: సాధారణంగా ఇరుగుపొరుగు వారి మధ్య తగాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మహిళల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు చివరకు ఘర్షణ వరకు దారితీస్తాయి. చిన్నపాటి విషయాలు, వివాదాలు చినికి చినికి గాలి వానలా మారుతాయి. ఇక నీటి కుళాయిల వద్ద, తాగునీటి బోర్ల వద్ద మహిళల మధ్య జరిగే లోకల్ ఫైట్( local fights ) అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇరుగు పొరుగు వారి మధ్య చెత్త ఊడ్చేటప్పుడు, శుభ్రం చేసిన సమయంలో మాత్రం వచ్చే తగాదాలు వీర లెవెల్ లో ఉంటాయి. అటువంటి ఘటనే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం పెద్ద ప్రకంపనలే రేపింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన గృహాలు చెత్తతో నిండిపోయాయి.
Also Read: Nehal Modi Arrest: నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్.
ఒడిస్సా లో ఘటన?
ఈ ఘటన ఒడిస్సాలో( Odissa) జరిగినట్టు తెలుస్తోంది. ఇంటి ఆవరణను శుభ్రం చేసే క్రమంలో ఇద్దరు మహిళల మధ్య చిన్నపాటి వివాదం ప్రారంభం అయింది. మాటా మాటా పెరిగింది. దీంతో వారు చీపుర్లకు పని చెప్పారు. చెత్తను ఊర్వడం ప్రారంభించారు. అలా ఊడ్చిన చెత్తను ఒకరి ఇంటి వైపు మరొకరు తోశారు. అంతటితో ఆగకుండా కాలువలో ఉన్న చెత్తను తీసి ఒకరి ఇంటిపై ఒకరు పోయడం ప్రారంభించారు. అయితే ఇరు కుటుంబాలకు సంబంధించి మగవారు కూడా ఉన్నారు. వారు కూడా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు.
సౌండ్ సెన్సార్ తో వీడియో
సాధారణంగా విలేజ్ ఫైట్ అనేది చూస్తుంటాం. ముఖ్యంగా మహిళల( ladies) మధ్య జరిగే వివాదం.. వారి నోటి నుంచి వచ్చే మాటలు.. ఎన్నెన్నో పాత విషయాలు.. రహస్య అంశాలు బయట పడుతుంటారు. అయితే వారికి పడని వ్యక్తులకు ఇవి వినసొంపుగా ఉంటాయి. అయితే ఈ వీడియోలో మాత్రం అటువంటి సదుపాయం లేదు. సౌండ్ సెన్సార్ చేసి.. దృశ్యాలను వీడియోలో పెట్టారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.