Heartbreaking Syria Photo: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఓ దేశంపై మరో దేశం యుద్ధం ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ సముద్ర మార్గంలో ప్రయాణిస్తూ ఇతర ప్రాంతానికి వెళ్లాలని భావించారు. అందులో ఒక పసికందు కూడా ఉన్నాడు. సముద్ర మార్గంలో వారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అలలు రావడంతో వారు ప్రయాణిస్తున్న కూడా మునిగిపోయింది. అందులో ఉన్న వారంతా జల సమాధి అయ్యారు. ఆ పసి బాలుడు సముద్రం నుంచి కొట్టుకొచ్చి ఒడ్డున అలా పడి ఉన్నాడు. అప్పట్లో ఆ దృశ్యం ప్రపంచం మొత్తాన్ని కలచివేసింది. ఆ దృశ్యం యుద్ధం ఎంతటి ప్రమాదకరమైనదో ప్రపంచానికి మరొకసారి నిరూపించింది.
వాస్తవానికి యుద్ధం అనేది సామ్రాజ్యవాదం దేశాలు ఆడే క్రీడ.. యుద్ధం వల్ల పేద దేశాలు చితికిపోతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా నష్టపోతాయి. అంతిమంగా సంపన్న దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. సంపన్న దేశాల వద్ద మాత్రమే ఆయుధాలు ఉంటాయి.. యుద్ధ సామగ్రి కూడా వాటి వద్దే ఉంటుంది. పెద్దం చేయాలంటే ఆయుధాలు కావాలి. సామగ్రి కూడా కావాలి. అవన్నీ దక్కాలి అంటే కచ్చితంగా సంపన్న దేశాల వద్ద వాటిని కొనుగోలు చేయాలి. అటు యుద్ధం వల్ల.. ఇటు యుద్ధ సామగ్రి అమ్ముకోవడం వల్ల సంపన్న దేశాలే లాభపడతాయి. అమెరికా నేడు ఈ స్థాయిలో ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది అంటే దానికి ప్రధాన కారణం కూడా ఇదే. గిట్టని వాళ్ళని కొట్టడం.. నచ్చనివాళ్ళను తొక్కడం.. తన ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచాన్ని నడిపించడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. అందువల్లే అమెరికా ఈ స్థాయిలో ఎదిగింది.
Also Read: జనాభా సంక్షోభాన్ని నివారించడానికి పథకం.. బిడ్డకు జన్మనిస్తే 1.30 లక్షలు ఇస్తారట..
వస్తు ఉత్పత్తిలో.. మిగతా వాటి విషయాలలో అమెరికా పురోగతి అంతంతమాత్రమే. కానీ భయపెట్టి బతికే విధానంలో అమెరికా ఆరితేరింది కాబట్టి.. ఈ స్థాయిలో ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. ఇక ఇటీవల ఇరాన్ మీద అమెరికా ఏ స్థాయిలో యుద్ధకాండ సాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే యుద్ధం వల్లఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెండు భీకరమైన యుద్ధాలను ప్రపంచం చవిచూసింది. ఆ యుద్ధాల వల్ల తీవ్రస్థాయిలో నష్టాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ యుద్ధ పిపాస ఉన్న నాయకులు ప్రపంచం మీద తమ మూర్ఖత్వాన్ని రుద్దుతూ నే ఉన్నారు. యుద్ధం వల్ల ఆస్తి నష్టం మాత్రమే కాదు.. మనుషుల నష్టం కూడా జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని తరాలు యుద్ధం వల్ల ప్రభావితం అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతాయి.
యుద్దాల వల్ల నలిగిపోయే బాలబాలికల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఎక్కడ ఏ సమయంలో బాంబులు పేలుతాయో ఎవరికీ తెలియదు. పైగా యుద్ధాల వల్ల బాల్యం బంది అవుతుంది. వారికి తినడానికి తిండి.. తాగడానికి నీరు.. ఉండడానికి ఆవాసం అనేవి లభించవు. నా అనే వాళ్ళు యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతారు. అట లోకం తెలియని పోకడ.. ఇటు ఆయన వాళ్లను పోగొట్టుకున్న దీనత్వం వారిని కథావికలం చేస్తాయి. అలాంటిదే ఓ ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో ఎటువంటి దారుణాలు చోటు చేసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు ఏ క్షణం బాంబు పడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. అభయం పెద్దలనే కాదు చిన్నారులను కూడా వేధిస్తుంది.
Also Read: ‘చెత్త’ వివాదం.. ఇళ్లు పీకి పందిరి వేసిన మహిళలు.. లోకల్ ఫైట్ వైరల్!
సిరియాలో ప్రస్తుతం అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం వల్ల అక్కడ పరిస్థితులు అద్వానంగా మారిపోయాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో చిన్నారులు నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఫోటోగ్రాఫర్ సిరియ ప్రాంతంలో ఓ చిన్నారిని ఫోటో తీస్తుండగా..ఫోటోగ్రాఫర్ పట్టుకున్న కెమెరాను ఆ చిన్నారి తుపాకీ అనుకొని భయపడింది. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. ఏడుస్తూ తన చేతులను పైకి ఎత్తింది. ఆ ఫోటో అక్కడి ఉదయ విధానమైన పరిస్థితిని తేట తెల్లం చేస్తోంది. జర్నలిస్టు అబూ షబాన్ ఈ ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ కదిలిస్తోంది. కన్నీళ్లు పెట్టేలా చేస్తోంది.