భారత జట్టును అన్ని విభాగాల్లో విజయవంతంగా నడిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే విరాట్ కోహ్లీ ఇటీవల అభిమానులకు, క్రికెట్ పండితులకు రెండు వరుస షాకులిచ్చిన విషయంతెలిసిందే. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 టీమ్ కెప్టెన్ గా వైదొలగనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఐపీఎల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగానూ వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరో కోహ్లీ లేని సమయాల్లో కెప్టెన్ గా ఉండి రోహిత్ శర్మ నిదహాస్ ట్రోఫి అందించాడు. అలాగే అతడు ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు చాంపియన్ గా నిలబెట్టాడు. మరో వైపు కోహ్లీ ఇటీవల బ్యాంటింగ్ సరిగా రాణించడం లేదు. అందుకే బ్యాటింగ్ పై శ్రద్ధ పెట్టేందుకే ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటాడని అందరూ భావించారు. కోహ్లీ ప్రవర్తన బాగోలేదని, భారత జట్టుకు టీ20 కెప్టెన్ గా తొలగించాలని పలువురు సీనియర్లు బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించాడు.
కోహ్లీ జట్టును బాగా నడిపిస్తున్నాడని అలాంటప్పుడు తామెందుకు అతడిని తప్పుకోవాలని ఒత్తిడి తెస్తామని ఎదురు ప్రశ్నించాడు. అది పూర్తిగా కోహ్లీ నిర్ణయమని తెలిపాడు. అలాగే ధోనీని మెంటార్ గా నియమించడంపై స్పందిస్తూ అతడో గొప్ప కెప్టెన్ అన్నాడు. అతడి సారథ్యంలో భారత్ మేటి జట్టుగా ఎదిగింది. ధోని కెప్టెన్సీలో టీ20, వన్డే ప్రంచకప్ లు, ఛాంపియన్స్ ట్రోఫీ సాధించమని గుర్తు చేశాడు. అతడిని మెంటర్ గా కొనసాగించడం భారత జట్టుకు ఉపయోగమని తెలిపాడు.