spot_img
HomeజాతీయంKartika Gopasthami : కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!

Kartika Gopasthami : కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!

kartika gopasthami  : హిందూ సంస్కృతిలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంటుంది. ఇది పూజల కాలం. ఈ నెలలో చాలా మంది ఉపవాసాలు చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. దీంతో దేవుడి కృప సాధించుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఇందులో భాగంగా కార్తీక మాసం శుక్ల పంక్షంలో ఎనిమిదో రోజున గోపాష్టమి వస్తుంది. ఇదినేడు రావడంతో అందరు గోవులను పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రోజు గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని చెబుతున్నారు. దీంతో గోవులను పూజించి వాటికి ఆహారం తినిపించి తమకు మోక్షం కలగాలని భావిస్తున్నారు. కార్తీక మాసంలో మహిళలు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుతున్నారు.

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన రోజునే గోపాష్టమిగా చెబుతారు. భక్తులు కృష్ణుడితో పాటు గోవులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజు తిరుమలలో పుష్పయాగ మహోత్సవం చేస్తారు. ఇంకా దుర్గాష్టమి వ్రతాన్ని కూడా నిర్వహిస్తుంటారు. గోపాష్టమి గురించి పురాణాలు ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. గోవులను పూజిస్తే ఇంద్రున్ని పూజించిన దానికంటే పుణ్యం ఎక్కువగా వస్తుందని చెప్పడంతో అందరు ఇంద్రునికి బదులుగా గోవులను పూజించారట. దీంతో ఇంద్రుడు కోపోద్రిక్తుడై వారం రోజుల పాటు ప్రళయం సృష్టించాడని చెబుతారు.

ఇంద్రుడి కోపం నుంచి గోవులను, గోపాలురను రక్షించే బాధ్యత తీసుకున్న కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్థన గిరి ఎత్తి వారం రోజుల పాటు గోవులు, గోపాలురను రక్షించాడు. దీంతో ఇంద్రుడు శ్రీకృష్ణుడి మహిమలు తెలుసుకుని భగవంతుడి స్వరూపంగా భావించి శాంతిస్తాడు. అందుకే ఈ రోజును గోపాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు గోవులను పూజిస్తే ఆయురారోగ్యాలు, కీర్తి, ధనం అన్ని కలుగుతాయని విశ్వసిస్తారు. గోవు లక్ష్మిదేవి స్వరూపం కాడంతో పూజ చేస్తే ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.

ఈ రోజు గోవులను భక్తులు విశిష్టంగా పూజిస్తారు. గోశాలలను సందర్శించి వాటిని శుభ్రం చేస్తారు. ఆవులను చక్కగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు వాటికి ఆహారం తినిపిస్తారు సకల పాపాలు తొలగుతాయని చెబుతారు. గోపాష్టమి సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు గోవులను పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. గోశాలలకు వెళ్లి గోవులను అలంకరించి పూజించి తమకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోపూజ చేసి తమ పాపాలను దూరం చేసుకోవాలని చూస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
SJP Protests

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
High Protein Breakfast

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....
Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Oktelugu Epaper