
ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. దేశంల ఏదో ఒక చోట ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గౌహతిలో చోటుచేసుకున్న సంఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. దిశ లాంటి చట్టాలున్నా అతివలపై అనర్థాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని గుంటూరులో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరగడం సంచలనం సృష్టించింది. వారు ఎదురుతిరగకపోతే అంతేసంగతి. ప్రతిఘటించి ప్రమాదాలను తప్పించుకోవాలి. అప్పుడే వారి ప్రాణాలను వారే రక్షించుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు సరైన శిక్షణ సైతం ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెగింపు పురుషులకంటే మహిళలకే ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ప్రమాదాల సమయంలో ఎందుకు ఊరుకుంటున్నారు. ఎదురుతిరిగితే విజయం వారిదే. ఆకతాయిల ఆటకట్టించే క్రమంలో వారిని వారే ప్రేరేపించుకోవాలి. జరుగుతున్న ప్రమాదాన్ని పసిగట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎదుటివారిని తన చేతులతో మట్టి కరిపించి రాబోయే ప్రమాదంపై పట్టు బిగించాలి. తమప్రాణాలకు తామే రక్షకులుగా మారాల్సిన సమయంలో ఏం ఆలోచించకుండా చివరికి ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడొద్దు.
స్థానికంగా భావన కాశ్యాప్ అనే యువతి వీధిలో నడుచుకుంటూ వస్తోంది. దీంతో దారిలో స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి ఆ యువతి దగ్గరకు వచ్చి ఆగాడు. ఏదో అడ్రస్ కావాలని అడిగాడు. దీంతో తనకు తెలియదని సమాధానం చెప్పడంతో అతడు మరింత దగ్గరకు వచ్చాడు. ఆమె వక్షోజాలపై చేతులు వేశారు. ఈనేపథ్యంలో ఆమె తోసివేయడంతో పక్కనున్న మురుగు కాలువలో పడిపోయాడు.
దీంతో అరుపులు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ వీడియో అక్కడ వైరల్ అవుతోంది. యువతి చేసిన సాహసాన్ని అందరు ప్రశంసిస్తున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాడిని డ్రైనేజీలోకి తోసి తనలోని శక్తిని నిరూపించుకుంది. అతడి పేరు రాజ్ కుమార్ అని తెలిసింది. నెటిజన్లు సైతం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆపద సమయంలో ఆమె చూపిన తెగువ మరిచిపోలేనిదన్నారు.
ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు మహిళలు చూపించే ధైర్య సాహసాలు అందరికీ అవసరమే. ఆపద చోటుచేసుకునే సందర్భంలో అతివలు కామ్ గా ఉండకుండా తనలోని ప్రతాపం చూపించి ప్రమాదాలను ఎదుర్కోవడం మంచిదే. ఇందు కోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా అవసరమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అందుకు తగిన పరిస్థితులను కల్పించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.