
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతున్న ఇష్యూ ఏదైనా ఉందంటే.. అది బిగ్ బాస్ గురించే. ఐదో సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరెవరు కంటిస్టెంట్స్ గా ఉన్నారు? హోస్ట్ ఎవరు? ఎప్పుడు మొదలవుతుంది? వంటివి ఫుల్ డిస్కషన్స్ లో ఉన్నాయి. అయితే.. సెప్టెంబర్ 5వ తేదీనే బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందని ప్రచారం గట్టిగానే సాగుతోంది. అయితే.. కంటిస్టెంట్ల మీదనే అందరి దృష్టీ పడింది.
ఈ సీజన్ లో బాగా ఫేమస్ అయిన వారిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సీజన్లో సినీ రంగం నుంచి హీరోయిన్ ఈషా చావ్లా, హీరో అశ్విన్ బాబు, సినీ నటి సురేఖ వాణి, డ్యాన్స్ మాస్టర్ శేఖర్, సింగర్ మంగ్లీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, బుల్లితెర విషయానికి వస్తే.. యాంకర్లు రవి, వర్షిణి, విష్ణు ప్రియ, నటులు నవ్యస్వామి, సిద్ధార్థ్ వర్మ ఉన్నట్టు సమాచారం. న్యూస్ యాంకర్ విభాగంలో ప్రత్యూష, సోషల్ మీడియా నుంచి టిక్ టాక్ దుర్గారావు, శణ్ముఖ్ జస్వంత్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక, హోస్ట్ విషయంలోనూ చాలా డిస్కషన్ నడుస్తోంది. బిగ్ బాస్ షోలో ఎక్కువ సార్లు హోస్ట్ గా చేసింది కింగ్ నాగార్జున మాత్రమే. మరి, ఈ సీజన్ కు నాగార్జున ఉంటారా? లేదా? అనే చర్చ కూడా ఎక్కువగానే సాగుతోంది. అయితే.. సోషల్ మీడియాలో సాగుతున్న డిస్కషన్ ప్రకారం.. ఈ సారి హోస్ట్ నాగార్జున కాకుండా రానా వస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే.. రానా పలు షోలలో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. దీంతో.. ఆయన్నే పట్టుకు రాబోతున్నారని అంటున్నారు.
ఇలా.. కంటిస్టెంట్లు, హోస్టు విషయంలో డిస్కషన్ సాగుతుండగా.. టిక్ టాక్ దుర్గారావు చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. సీజన్ ఐదులో దుర్గారావును తీసుకుంటున్నారనే ప్రచారం చాలా కాలంగా డిస్కషన్లో ఉంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన దుర్గారావు.. బిగ్ బాస్ ఎంట్రీపై స్పందించారు.
ఇంటర్వ్యూలో భాగంగా.. ‘‘మీరు బిగ్ బాస్ షోలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత? మీరు ఒక్కరే ఒక్కరే వెళ్తారా? మీ భార్యను కూడా తీసుకెళ్తారా?’’ అని అడగ్గా.. ‘‘నాకు బిగ్ బాస్ షోలోకి వెళ్లే ఛాన్స్ వస్తే.. ఇద్దరం కలిసే వెళ్దామని అనుకున్నాను. అయితే.. ఇప్పుడు ఒక్కడినైనా వెళ్తా. ఈ మధ్య ఎవరో నాకు ఫోన్ చేసి బిగ్ బాస్ లోకి వస్తారా? అని అడిగారు’’ అని సీక్రెట్ చెప్పేశారు. దీంతో.. దుర్గారావు బిగ్ బాస్-5లోకి వెళ్లడం ఖాయమైందన్న వార్తలకు మరింత బలం చేకూరింది. మరి, నిజమేంటన్నది తెలియాలంటే.. షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.