Surya Ghar Yojana: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్‌.. కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం!

ప్రధాన మంత్రి సూర్యఘర్‌ స్కీంకు కింద చేపట్టే సోలార్‌ ప్రాజెక్టుకు రూ.75,021 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024, ఫిబ్రవరి 13న పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా సోలార్‌ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు మంచి వ్యాపారం పొంతాయని భావిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 3:08 pm
Follow us on

Surya Ghar Yojana: దేశంలో కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందించే కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశంలోని కోటి కుటుంబాలకు సోలార్‌ విద్యుత్‌ అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈమేకు ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకానికి గురువారం(ఫిబ్రవరి 29న) కేంద్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కోటి ఇళ్లలో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

రూ.75,021 కోట్లు..
ప్రధాన మంత్రి సూర్యఘర్‌ స్కీంకు కింద చేపట్టే సోలార్‌ ప్రాజెక్టుకు రూ.75,021 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024, ఫిబ్రవరి 13న పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ స్కీం ద్వారా సోలార్‌ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు మంచి వ్యాపారం పొంతాయని భావిస్తున్నారు.

రూ.30 వేల సబ్సిడీ..
సూర్య ఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద 1 మెగావాట్ల సోలార్‌ పవర్‌ యూనిట్‌ క ఓసం రూ.30 వేల వరకు సబ్సిడీ అందుతుంది. 2 మెగావాట్ల సోలార్‌ సిస్టంకు రూ.60 వేలు, 3 మెగావాట్ల అంతకన్నా ఎక్కువ ఉన్న సిస్టంలకు రూ.78 వేల సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. కావాల్సిన కుటుంబాలు జాతీయ పోర్టల్‌ ద్వారా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూఫ్‌టాప్‌ సోలార్‌ కోసం విక్రేతను ఎంచుకోవచ్చు.

తక్కువ వడ్డీకి రుణం..
ఇక సోలార్‌ రూఫ్‌ టాప్‌ కోసం వినియోగారులు తక్కువ వడ్డీకి రుణం కూడా పొందే అవకాశం ఉంది. కేవలం 7 శాతం వడ్డీతో సోలార్‌ సిస్టం ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అందరికీ తెలిసేలా సూర్య ఘర్‌ స్కీంలో ప్రతీ జిల్లాలో మోడల్‌ సోలార్‌ గ్రామాలను అభివృద్ధి చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రూఫ్‌టాప్‌ సోలార్‌ను దత్తత తీసుకుని రోల్‌ మోడల్‌గా వ్యవహరిస్తారు. ఇక రాయితీ నుంచి బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్రం భరోసా ఇస్తుంది. ఈ స్కీం ద్వారా ప్రజల విద్యుత్‌ బిల్లులు ఆదా అవుతాయి. అదనపు ఆదాయం కూడా పొందుతారు. మిగులు విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించడం ద్వారా స్కీం తయారీ, లాజిస్టిక్స్, సరఫరా, కొనుగోలు, అమ్మకాలు సంస్థాపన తదితర సేవల్లో 17 లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది.