spot_img
Homeలైఫ్ స్టైల్Ugadi 2026 wishes quotes: మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ అందమైన కొటేషన్స్ తో ఉగాది శుభాకాంక్షలు...

Ugadi 2026 wishes quotes: మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ అందమైన కొటేషన్స్ తో ఉగాది శుభాకాంక్షలు తెలపండి..

Ugadi 2026 wishes quotes: తెలుగు క్యాలెండర్ ప్రకారం మార్చి 19న చైత్రమాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలోని పాడ్యమి రోజున ఉగాది పండుగ నిర్వహించుకుంటారు. 2026-27 సంవత్సరాన్ని శ్రీ పరాభవ నామ సంవత్సరం గా పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో అన్ని విజయాలు చేకూరాలని.. సుఖశాంతులు కలగాలని.. అనుకున్న పనులు నెరవేరాలని.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఎదుటివారి సంతోషాన్ని కోరుకునేవారు మాటల రూపంలో కాకుండా ప్రత్యేకంగా శుభాకాంక్షలు రూపంలో తెలపడం వల్ల వారి మనసును ఆకట్టుకున్న వారవుతారు. అలాంటివారికి ఆకర్షణీయమైన పదాలతో ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఆకట్టుకోవచ్చు. అలాంటి ఆకర్షణీయమైన పదాలతో విషెస్ చెప్పే కొటేషన్స్ ఈ కింద ఉన్నాయి..

మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఒక్కటిగా చేర్చి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ… ఉగాది శుభాకాంక్షలు.

ఈ ఉగాదితో మీ ఇంట్లో సంతోషం వెల్లి విరియాలని, కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు..

పాత సంవత్సరంలోని చేదు, తీపి జ్ఞాపకాలను మెమరీసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసే తెలుగు పండుగ ఉగాది శుభాకాంక్షలు..

మీ జీవితంలో ఎప్పటికీ తీయదనం ఉంటూ.. చేదు జ్ఞాపకాలు తొలగిపోవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..

కాలం మారుతున్న క్రమంలో.. తెలుగు కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు..

మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..

లేత మామిడి ఆకుల తోరణాలు, అందమైన ముగ్గులు, పిండి వంటలతో ఈ ఉగాది పండుగ సంతోషంగా గడవాలని కోరుకుంటూ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు..

చిరాకుల ఊయలలతో.. కోయిలల గానాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు.

వేప పువ్వు చేదు, మామిడి వగరు, కోయిలమ్మ పాటతో మొదలవుతున్న ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో అన్ని విజయాలు చేకూర్చాలని కోరుకుంటూ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు..

ఉగాది పచ్చడిలాగే జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి.. నిత్యం సంతోషంగా ఉంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..

నూతన ఉత్సాహంతో.. సరికొత్త ఆలోచనలతో ప్రారంభమయ్యే ఈ పరాభవ నామ సంవత్సరం మీకు సుఖశాంతులను తీసుకురావాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..

శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ ఇంట్లో సంతృప్తి, ఆనందం, శాంతిని చేకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..

ఆనందం, శాంతి, సంతృప్తి తో మీ జీవితం ముందుకు సాగాలని కోరుకుంటూ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

సకల అనుభూతుల సమ్మేళనం.. ఆరు రుచుల పచ్చడితో ఈ కొత్త సంవత్సరం పండుగ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper
Exit mobile version