Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Ustaad Bhagat Singh remuneration: పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక్క రూపాయి...

Pawan Kalyan Ustaad Bhagat Singh remuneration: పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంటూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాత హాట్ కామెంట్స్!

Pawan Kalyan Ustaad Bhagat Singh remuneration: మరి కొద్దిగంటల్లోనే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh_ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని ఎప్పుడో 2020 వ సంవత్సరం లో ప్రకటించారు. ప్రకటించిన కొత్తల్లో ఈ సినిమా పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’. ఇది ఖుషి చిత్రానికి సీక్వెల్. కానీ ఆ తర్వాత అభిమానుల డిమాండ్స్ ని చూశాక ఒక మాస్ కమర్షియల్ మూవీ ని చేద్దామని అనుకున్నాడు హరీష్ శంకర్. అందుకోసం ఆయన ముందుగా ‘తేరి ‘ రీమేక్ చెయ్యాలని భావించాడు. కానీ అభిమానుల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచన విరమించుకొని, కొత్త స్టోరీ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని మొదలు పెట్టారు. 2023 వ సంవత్సరం లో మొదలు పెట్టి ఒక పది రోజుల పాటు షూటింగ్ చేశారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం తో దాదాపుగా రెండేళ్లు షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ గత ఏడాది జూన్ లో మొదలు పెట్టి ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశారు. అయితే ఈ సినిమా పై అప్పట్లో ఉన్న అంచనాలు ఇప్పుడు లేవు. అందుకు ఉదాహరణ ఓవర్సీస్ లో అంత దారుణమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరగడమే. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ కి హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా నార్త్ అమెరికా లో రాలేదంటే, ఇది ఘోరమైన అవమానమే అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ని మేకర్స్ నేడు ఏర్పాటు చేశారు. ఈ చిత్రం గురించి అభిమానులెవ్వరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను నిర్మాతలు పంచుకున్నాడు. అందులో నిర్మాత పవన్కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో ఇతర హీరోల పాటలకు పవన్ కళ్యాణ్ డ్యాన్స్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా ?

పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే ప్రశ్నకు నిర్మాత నవీన్ సమాధానం చెప్తూ’ చాలా రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారికి మేము టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము. అది తప్ప ఆయన ఒక్క రూపాయి రెయూనేరషన్ కూడా తీసుకోలేదు. మీకు ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పటి వరకు ఇచ్చింది చాలు , లాభాలు వస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ప్రస్తుతం నేను రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉన్నాను. అయినప్పటికి మీ సినిమాకు నాన్ స్టాప్ గా మూడు నెలలు పని చేసి పూర్తి చేస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి లాభాల్లోకి రావాల్సిందే. అప్పుడే పవన్ కళ్యాణ్ కి లాభాలు వస్తాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version