https://oktelugu.com/

Oppo F25 Pro 5G: భారత్‌ లో ఒప్పో ఎఫ్‌ 25 ప్రో 5జీ లాంచ్‌.. ధర, ఫీచర్స్, లాంచింగ్‌ ఆఫర్లు ఇవీ..

రియల్‌మీ 12ప్రో, రెడ్‌మీ నోట్‌ 13ప్రో వంటి ఇతర చైనా కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగులాళ ఫుల్‌ హెచ్‌డీ+ఓల్‌ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 1, 2024 / 03:06 PM IST
    Follow us on

    Oppo F25 Pro 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌లో ఒప్పో కొన్ని రోజులుగా వెనుకబడింది. అయితే పోటీని తట్టుకునేందుకు చైనా ప్రత్యర్థులకు పోటీగా తాజాగా ఎఫ్‌25 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో భారత్‌లో లాంచ్‌ చేసింది.

    రియల్‌మీ 12ప్రో, రెడ్‌మీ నోట్‌ 13ప్రో వంటి ఇతర చైనా కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.23,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగులాళ ఫుల్‌ హెచ్‌డీ+ఓల్‌ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

    ధరలు ఇవీ..
    – మనదేశంలో ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.23,999 కాగా, 8 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.25,999గా నిర్ణయించారు. మార్చి 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఈ ఒప్పో లేటెస్ట్‌ మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2 వేల డిస్కౌంట్‌ లభిస్తుంది.

    ప్రత్యేకతలు ఇలా..
    ఒప్పో ఎఫ్‌25ప్రో 5జీలో 120 హెర్జ్‌ వరకు రిఫ్రెష్‌ రేట్‌తో, 1100 నిట్స్‌ గరిష్ట బ్రైట్నెస్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్డీ+ఫ్లెక్సిబుల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ మిడ్‌–రేంజ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఐపి 54 ప్రొటెక్షన్‌తో, అలాగే, పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఒప్పో ఎఫ్‌ 25ప్రో 5 జీ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌ సెట్‌ ను అమర్చారు. అలాగే, అన్ని గ్రాఫిక్స్‌ ఇంటెన్సివ్‌ కార్యకలాపాల కోసం మాలి–జి 68 ఎంసీ 4 జీపీయూను కూడా పొందుపర్చారు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్‌ 4ఎక్స్‌ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్‌ఎస్‌ 3.1 స్టోరేజ్‌ ఇందులో ఉన్నాయి.

    కెమెరా ఫీచర్స్‌ ఇలా..
    ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ కెమెరా ఆప్టిక్స్‌ పరంగా చూస్తే, ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ కెమెరా 64 మెగాపిక్సెల్స్‌ ప్రైమరీ సెన్సార్, 8 మెగా పిక్సెల్‌ అల్ట్రా–వైడ్‌ యాంగిల్‌ లెన్స్, 2 మెగాపిక్సెల్‌ మాక్రో లెన్స్‌తో ట్రిపుల్‌ కమెరా సెటప్‌ ఉంటుంది. సెల్ఫీ, వీడియోకాల్‌లకు సంబంధించి ఫ్రంట్‌ కెమెరాను 32 మెగాపిక్సెల్‌ ఉంది. పోర్ర్‌టెయిట్‌ మోడ్, నైట్‌ మోడ్, ఎక్స్‌ట్రా హెచ్డీ మోడ్, పానో, స్లో మోషన్, టైమ్‌–ల్యాప్స్, డ్యూయల్‌ వ్యూ వీడియో, స్టిక్కర్, టెక్ట్స్‌ స్కానర్, గూగుల్‌ లెన్స్‌ వంటి అనేక కెమెరా మోడ్‌లకు ఈ కెమెరా యాప్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్‌ ఫోన్‌ వెనుక కెమెరా, అలాగే, ముందు కెమెరాల నుండి 30 ఎఫ్పిఎస్‌ వద్ద 4కె వీడియోలను రికార్డ్‌ చేయగలదు.